E-Paper
Advertisement

Allu Arvind: అల్లు స్టూడియోస్ వెనుక అల్లు అరవింద్ కోరికే కారణమా..ఆ థియేటర్ చూసి ఈర్ష్య పడ్డారా?

Allu Arvind: అల్లు స్టూడియోస్ వెనుక అల్లు అరవింద్ కోరికే కారణమా..ఆ థియేటర్ చూసి ఈర్ష్య పడ్డారా?
Advertisement

Allu Aravind: అల్లు అరవింద్ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అరవింద్ (Allu Aravind)ఇప్పుడు ఇండస్ట్రీలో స్టూడియో నిర్మాణంతో పాటు థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుపెట్టారు. ఈయన కోకాపేటలో అల్లు సినిమాస్ (Allu Cinemas)పేరిట ఒక థియేటర్ ప్రారంభించారు. తాజాగా ఈ అల్లు సినిమాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంతో ఘనంగా ఈ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు.

యు.వి క్రియేషన్స్ వంశీ థియేటర్ చూసి..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్  మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు .ముఖ్యంగా అల్లు సినిమాస్ నిర్మించడానికి గల కారణాలను తెలియజేశారు. అల్లు సినిమాస్ నిర్మించడానికి రెండే ప్రధాన కారణాలు ఉన్నాయని ఆ కారణాల చేతే తాను నిర్మించానని తెలిపారు. ఈ థియేటర్ నిర్మాణం వెనుక మొదటి కారణం సూళ్లూర పేటలో యు.వి క్రియేషన్స్ వంశీ కట్టిన అతిపెద్ద థియేటర్ చూసిన తర్వాత నాకు ఇలాంటి థియేటర్ కట్టాలని కోరిక కలిగిందని, ఈ స్టూడియో నిర్మాణానికి అది ప్రధాన కారణమని తెలిపారు. అలాగే రెండో కారణాన్ని కూడా అల్లు అరవింద్ తెలియజేస్తూ.

అల్లు సినిమాస్ టికెట్ ధరలు..

Advertisement

నాకు బాగా పరిచయమున్న ఒక బడా వ్యాపారవేత్త మిషన్ ఇంపాజిబుల్ 6 సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రసాద్ pcx స్క్రీన్ లో టికెట్స్ కావాలని ప్రాదేయపడటం రెండో కారణమని తెలిపారు. ఇలా ఈ రెండు కారణాలతోనే నాకు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలని కోరిక కలిగింది అంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా అల్లు సినిమాస్ నిర్మించడానికి కారణాలను తెలియజేయడంతో ఇది కాస్త  వైరల్ అవుతుంది. ఇక అల్లుఅర్జున్ నిర్మించిన ఈ థియేటర్ లో 75 అడుగులతో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయబడి ఉంది . ఏషియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఉన్న థియేటర్ గా అల్లు సినిమాస్ పేరు గాంచింది. ఈ థియేటర్ లో మొత్తం నాలుగు స్క్రీన్ లో ఉండగా ఒకటి మాత్రమే డాల్బీ స్క్రీన్ అని తెలుస్తోంది . అల్లు సినిమాస్ లో ఒక టికెట్ ధర 450 రూపాయలు ఉండబోతున్నట్టు సమాచారం.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రారంభం..

Advertisement

ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్లో ఉగాది పండుగను పురస్కరించుకొని మొదటి సినిమా ప్రసారం కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అల్లు సినిమాస్ లో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం ధురంధర్ కూడా అల్లు సినిమాస్ లో  ప్రసారం కాబోతుందని సమాచారం. ఇక ఈ థియేటర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా డాల్బీ సౌండ్ సిస్టం గురించి కొన్ని ప్రసారం చేశారు. ఇందులో పుష్ప 2 తో పాటు వారణాసి రామాయణ 3D ట్రైలర్ ప్రసారం చేశారు అలాగే RRR సినిమాలోని కొన్ని సన్నివేశాలను కూడా ప్రసారం చేశారు.

Also Read: Arjun Das: ఓజి నటుడికి లవ్ బ్రేకప్..సంచలనంగా మారిన పోస్ట్!

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×