E-Paper
Advertisement

Allu Arha: తండ్రికి తగ్గ తనయ.. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న అల్లు అర్హ!

Allu Arha: తండ్రికి తగ్గ తనయ.. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న అల్లు అర్హ!
Advertisement

Allu Arha: అల్లు అర్హ పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) వారసురాలుగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే.  అల్లు అర్హ(Allu Arha) ఇప్పటికే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.  సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమాలో ఈమె బాలనటిగా నటించిన మెప్పించారు.  ఈ సినిమా తర్వాత అల్లు అర్హ సినిమాలలో తిరిగి నటించలేదు అయితే ఈమె ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్హ చెస్(Chess) ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే చెస్ ఆడుతూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ చిన్నారి తాజాగా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్…

అల్లు అర్హ తాజాగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (Nobel book of world records) లో చోటు సంపాదించుకున్నారు. ఇది వరకే అర్హ వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా అవార్డును సొంతం చేసుకున్నారు. నాలుగున్నర సంవత్సరాల వయసులోనే చెస్ట్ లో ఎన్నో మేలుకువలు నేర్చుకున్న అర్హ తన కంటే పెద్దవారికి చెస్ లో శిక్షణ కల్పించారు. అర్హ 30కి పైగా చెస్ పజిల్స్ పూర్తి చేయడమే కాకుండా 50 మందికి శిక్షణ ఇవ్వడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఇలాంటి ఘనత మంచు లక్ష్మి కుమార్తె నిర్వాణ తర్వాత అర్హ సొంతం చేసుకున్నారని చెప్పాలి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అర్హ..

Advertisement

అర్హ చెస్ పోటీలలో ఈ విధమైనటువంటి అవార్డును సొంతం చేసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా అర్హతపై ప్రశంసలు కురిపిస్తూ తండ్రికి తగ్గ తనయ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఒకవైపు క్రీడలలో ఎంతో చలాకీగా ఉన్న అర్హ మరోవైపు తన స్టడీస్ పై కూడా దృష్టి సారించారు. ఈ తరుణంలోని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో ఈమె అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల పై ఎక్కడ అధికారక ప్రకటన వెలువడ లేదు.

సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్..

Advertisement

సినిమాల పట్ల అల్లు అర్హ ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారని తెలుస్తుంది. భవిష్యత్తులో అల్లు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అల్లు స్నేహ రెడ్డి నిత్యం తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అల్లు అర్హకు సోషల్ మీడియాలో కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇక అయాన్ నిత్యం సోషల్ మీడియా వార్తలలో హల్చల్ చేస్తూ ఉంటారు. అర్హ బాలనటిగా వెండి తెరపై సందడి చేసినప్పటికీ ఆయాన్ మాత్రం ఇంకా వెండితెరకు దూరంగానే ఉన్నారని చెప్పాలి.

 

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×