E-Paper
Advertisement

Entry Level Jobs: కష్టమైన ఉద్యోగం కంటే.. ఖాళీగా ఉండటమే మేలట, యువతలో ఎందుకంత విరక్తి !

Entry Level Jobs: కష్టమైన ఉద్యోగం కంటే.. ఖాళీగా ఉండటమే మేలట, యువతలో ఎందుకంత విరక్తి !
Advertisement

Entry Level Jobs: సాధారణంగా.. ఉద్యోగం దొరికితే జీవితంలో సెటిల్ భావిస్తాం. అయితే.. 2025లో ఉద్యోగంలోకి కొత్తగా అడుగుపెడుతున్న యువతలో మాత్రం ఒక వింత అసంతృప్తి కనిపిస్తోంది. సరైన జీతం, పనిభారం, భవిష్యత్తుపై అభద్రతాభావం కారణంగా.. మొదట సంపాదించిన నిరుద్యోగం కంటే దారుణంగా.. ఒత్తిడితో కూడిన అనుభూతిని ఇస్తున్నాయి. అందుకే యువత ఉద్యోగం కంటే ఖాళీగా ఉండటమే బెటర్ అనుకుంటున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. జీతం- పెరిగే ఖర్చులు:

ప్రస్తుతం ఖర్చులు తారా స్థాయికి చేరాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లోఇంటి రెంట్‌లతో పాటు , ఆహారం ఖరీదైనవిగా మారాయి. అయినప్పటికీ జీతం పెరగకపోవడం యువతకు తలనొప్పిగా మారాయి. అంతే కాకుండా కొత్తగా తీసుకునే ఉద్యోగులకు ప్రారంభంలో జీతం తక్కువగా ఉంటుంది. కొన్ని సంస్థల్లో ఏళ్లు గడుస్తున్నా జీతంలో పెద్దగా మార్పు ఉండదు. కొత్త ఉద్యోగికి వచ్చే జీతం, కనీస అవసరాలకు కూడా సరిపోక, ఆర్థికంగా ఎప్పుడూ వెనుకబడినట్లు అనిపిస్తుంది. కనీసం తమ కోసం ఏమీ మిగుల్చుకోలేని స్థితిలో ఉండటం నిరాశకు దారి తీస్తుంది.

Advertisement

2. ఎక్కువ అంచనాలు:

ప్రారంభ స్థాయి ఉద్యోగాలు అంటే.. సంస్థలు కేవలం ప్రాథమిక నైపుణ్యాలను ఆశిస్తాయి. కానీ.. ప్రస్తుతం చాలా కంపెనీలు అనుభవజ్ఞుడైన వ్యక్తి చేయగలిగిన పనిని, అదే జీతంతో కొత్త వ్యక్తి నుంచి ఆశిస్తున్నాయి. “ఎంట్రీ-లెవల్ జాబ్” అని ప్రకటించి.. 3-4 సంవత్సరాల అనుభవం అడగడం సర్వసాధారణమైపోయింది.

కొత్త ఉద్యోగులు మొదటి రోజు నుంచే తమ సామర్థ్యానికి మించి, తీవ్రమైన ఒత్తిడితో పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒత్తిడి వారిని నిస్సత్తువకు గురి చేస్తుంది. జాబ్ మానేయడం బెటర్ అనే స్థాయికి తెస్తుంది.

3. విపరీతమైన పనిభారం:

ఆర్ధిక అనిశ్చితి కారణంగా.. అనేక సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, ఉన్న ఉద్యోగులపై పనిభారాన్ని పెంచుతున్నాయి. కొత్తగా చేరినవారు తమను తాము నిరూపించుకోవాలనే తపనతో ఎక్కువ పని గంటలు పనిచేయాల్సి వస్తుంది. పని, జీవితం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అంతే కాకుండా వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సరదాలకు సమయం దొరకకపోవడం వల్ల జీవితం కేవలం జీతం కోసం పనిచేయడానికే అన్న భావన చాలా మందిలో కలుగుతుంది.

4. భవిష్యత్తుపై భయం:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయాలు చాలా మంది యువతలో ఉద్యోగ భద్రత పట్ల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తమ పనులు త్వరలోనే AI ద్వారా భర్తీ అవుతాయేమోనని యువ ఉద్యోగులు భయపడుతున్నారు. ఇదెలా ఉంటే.. పెద్ద పెద్ద కంపెనీలలో కూడా లే-ఆఫ్‌లు జరుగుతుండటంతో.. ఎంత కష్టపడినా తమ ఉద్యోగం శాశ్వతం కాదనే భయం కూడా వెంటాడుతోంది.

Also Read: ఈ ఏడాది.. బ్రేకప్‌లను ఆపుతున్న ఒకే ఒక ప్రశ్న ఇదేనట !

5. నిరుద్యోగంతో పోలిక:

నిరుద్యోగికి పని లేదు కానీ.. సమయం తన సొంతం. అతను నైపుణ్యాలు పెంచుకోవడానికి, లేదా వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి ఆ సమయాన్ని వాడుకోవచ్చు. కష్టపడి పనిచేసినా.. ఆర్థిక స్థిరత్వం లేని ఉద్యోగంలో ఇరుక్కుపోయిన వ్యక్తికి.. ఆ ఒత్తిడితో కూడిన ఉద్యోగం కంటే నిరుద్యోగమే మెరుగైన ఎంపిక అనిపించడం సహజం.

ప్రారంభ స్థాయి ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో ప్రోత్సాహకరంగా లేకపోవడం అనేది వ్యాపార పద్ధతులలో వచ్చిన మార్పులకు నిదర్శనం. కంపెనీలు కొత్తగా ఉద్యోగంలో చేర్చుకున్న వారికి సరైన జీతం, గౌరవం, పని-జీవితం వంటి వాటి పట్ల సమతుల్యత కల్పించడం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలవు. లేకపోతే.. యువత తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి.. మంచి అవకాశం వచ్చే వరకు నిరుద్యోగిగా ఉండటానికే మొగ్గు చూపుతారు.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×