E-Paper
Advertisement

Allu Arjun- Lokesh : ఏంటయ్యా లోకేషా.. మా బన్నీని ఏం చేస్తున్నావ్..?

Allu Arjun- Lokesh : ఏంటయ్యా లోకేషా.. మా బన్నీని ఏం చేస్తున్నావ్..?
Advertisement

Allu Arjun- Lokesh : టాలెంట్ ఉన్నాయి ఎవడైనా సరే ఏ రంగంలోనైనా రానిస్తాడు అన్నది వాస్తవం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో టాలెంట్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ అదృష్టం తో పాటు టాలెంట్ కూడా ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.. స్టార్ కిడ్స్ లలో కొంతమంది తమ టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం పుష్ప మూవీతో నేషనల్ వైడ్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకొని ఐకాన్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు.. దాంతో పాటుగా లోకేష్ కనకరాజ్ తో ఓ మూవీ చెయ్యనున్నాడు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

ట్రాన్స్ జెండర్ గా బన్నీ..

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ డైరెక్టర్ లతో వరుసగా సినిమాలు చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లతో ఒక్కో సినిమాని లైన్లో పెట్టుకుంటూ వస్తున్నాడు.. మొదటినుంచి అల్లు అర్జున్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. రీసెంట్గా ఆయన నుంచి వచ్చిన పుష్ప సినిమాలో మాస్ హీరోగా అదరగొట్టేసాడు. ప్రస్తుతం మరోసారి మాస్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మూవీలో నటిస్తున్నాడు.. ఈ మూవీ తో పాటుగా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఓ మూవీ చేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆ మూవీలో ఆయన ఒక ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని ఇప్పటివరకు ఎవరు పోషించనటువంటి ఒక డిఫరెంట్ కోణంలో ఈ పాత్ర ఉండటం వల్లే అల్లు అర్జున్ ఆ పాత్ర ఒప్పుకున్నాడని టాక్.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు లోకేష్ కనకరాజు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటయ్యా లోకేష్ ఆ మా బన్నీని ఏం చేయాలనుకుంటున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

Advertisement

Also Read :బాలీవుడ్ లో గోల్డెన్ ఆఫర్.. సైన్స్ ఫిక్షన్ మూవీలో రష్మిక..?

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి నుంచి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఆర్య సినిమాతో లవర్ బాయ్ గా మారాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా లవ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో వచ్చినవే. పుష్ప మూవీతో ఒక్కసారిగా యాక్షన్ హీరో అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 లో కూడా మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అట్లీ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. లోకేష్ తో మూవీ ఫినిష్ చేసి పుష్ప 3 లో నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×