E-Paper
Advertisement

Allu vs Mega Family: అల్లు ఆర్మీకి పోటీగా మెగా యూత్ ఫోర్స్? ఫ్యామిలీ ఫైట్.. ఫ్యాన్ వార్‌గా మారనుందా?

Allu vs Mega Family: అల్లు ఆర్మీకి పోటీగా మెగా యూత్ ఫోర్స్? ఫ్యామిలీ ఫైట్.. ఫ్యాన్ వార్‌గా మారనుందా?
Advertisement

AlluArjun-vs-Mega-family:టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీలో ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న ‘కోల్డ్ వార్’ ఇప్పుడు బహిరంగ ‘గ్యాంగ్ వార్’గా మారిందా? ‘మెగా ఇమేజ్ కాదని, తనకంటూ ఒక సొంత ‘సామ్రాజ్యాన్ని’ నిర్మించుకోవాలని అల్లు అర్జున్ వేసిన  అడుగులు.. వాటికి  పోటీగా మెగా యూత్ ఫోర్స్ అంటూ మెగా కాంపౌండ్ సరికొత్త మొదలెట్టడం ..ఇపుడు ఇండస్ట్రీలో  ప్రకంపనలు పుట్టిస్తున్నాయా? యస్ … తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ‘మామ-అల్లుడు’ బంధం కేవలం ఫార్మాలిటీకే పరిమితమైందని, గ్రౌండ్ లెవల్‌లో మాత్రం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చాటుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధమయ్యాయని ఇండస్ట్రీ టాక్.

అల్లు అర్జున్ ‘ఆర్మీ’ రీలోడెడ్: మెగా ట్యాగ్ నుండి విముక్తి కోసమేనా?
పుష్ప సినిమాతో ‘నేషనల్ అవార్డ్’ కొట్టిన బన్నీ, ఇప్పుడు తానొక ‘సెల్ఫ్ మేడ్ స్టార్’ అని నిరూపించుకునే పనిలో పడ్డారు.
బన్నీ 5 గంటల సీక్రెట్ మీటింగ్: అందులో భాగంగానే హైదరాబాద్‌లో గతేడాది పిబ్రవరిలో  జరిగిన AAFA మీటింగ్‌లో కేవలం అభిమానులను కలవడమే కాదు.. “మనం ఎవరి మీద ఆధారపడకూడదు, మనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండాలి” అనే సంకేతాలు వెళ్లినట్లు సమాచారం.
మెగా ఫ్యాన్స్ అంటే నో: ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ గ్రూపుల్లోనే అల్లు ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ‘అల్లు ఆర్మీ’ పేరుతో జిల్లాల వారీగా సపరేట్ కమిటీలు వేయడం అంటే.. మెగా ఫ్యామిలీ నుండి అధికారికంగా తన  ఫ్యాన్స్ ని  వేరు చేయడమే అన్నది విశ్లేషకుల మాట.

Advertisement

‘మెగా యూత్ ఫోర్స్’.. బన్నీకి చెక్ పెట్టేందుకేనా?
అల్లు అర్జున్ తన ఫ్యాన్ బేస్‌ను సపరేట్ చేసుకుంటున్న తరుణంలోనే, సుస్మిత కొణిదెల ఆధ్వర్యంలో ‘మెగా యూత్ ఫోర్స్’ లాంచ్ అవ్వడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.
త్రిమూర్తుల కలయిక: చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ఈ ముగ్గురి అభిమానులను ఒకే తాటిపైకి తీసుకురావడం అంటే, బన్నీకి ఇక మెగా సపోర్ట్ లేదని చెప్పకనే చెప్పడమేనా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.
మెగా వారసురాలి ఎంట్రీ: సాక్షాత్తూ చిరంజీవి కుమార్తె సుస్మిత ఈ ఫోర్స్‌ను లీడ్ చేయడం చూస్తుంటే, అల్లు ఫ్యామిలీ దూకుడుకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను మెగా వారసులే తీసుకున్నట్లు అర్థమవుతోంది.

ఎన్నికల నాటి గాయం.. ఇంకా పచ్చిగానే ఉందా?

Advertisement

ఎన్నికల సమయంలో  కూటమికి వ్యతిరేకంగా వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్న బన్నీస్నేహితుడు శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డికి మద్దతుగా  నంద్యాలలో ప్రచారం చేశారు,ఇది ఒకరకంగా  మెగా ఫ్యామిలీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ సమయంలో మొదలైన గ్యాప్, ఇప్పుడు ‘ఫ్యాన్స్ అసోసియేషన్ల’ యుద్ధానికి దారి తీసింది.
అల్లు రామలింగయ్య వారసత్వమే ముద్దు: బన్నీ తన స్పీచ్‌లలో ‘మెగాస్టార్’ పేరును తగ్గించి, తన తాత అల్లు రామలింగయ్య పేరును ఎక్కువగా ప్రస్తావించడం మెగా ఫ్యాన్స్‌కు మంట పుట్టిస్తోంది.

గ్రౌండ్ లెవల్ వార్: ఆర్మీ vs ఫోర్స్!
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, గ్రౌండ్ లెవల్‌లోనూ ఒకటే చర్చ.. “బన్నీ వర్సెస్ చరణ్-పవన్”.ఒకప్పుడు కలిసి ఉన్న అభిమానులు ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయారు.ఒకవైపు అల్లు అర్జున్ అట్లీతో కలిసి పాన్ ఇండియా రేంజ్‌లో తన పవర్‌ను చూపిస్తుంటే,మరోవైపు మెగా ఫ్యామిలీ తన బ్రాండ్ పవర్ చూపేందుకు ‘మెగా యూత్ ఫోర్స్’ పేరుతో కొత్త సైన్యాన్ని దింపింది. ఒకరకంగా ఇది కేవలం సినిమాల మధ్య పోటీ కాదు.. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు.మరి ‘ఐకాన్ స్టార్’తనను తాను సుప్రీమ్ అనుకుంటున్నారా? లేక ‘మెగా ఫోర్స్’ ముందు అల్లు ఆర్మీ తలవొంచుతుందా? చూడాలి.ఏది ఏమైనా ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ రెండు కుటుంబాల మధ్య మరిన్ని మంటలు పుట్టడం ఖాయంగానే కనిపిస్తుంది .

also read:  ‘ఉస్తాద్’ అడ్రస్ గల్లంతు.. ‘భోళా శంకర్’ రికార్డులను తిరగరాస్తున్న పవన్ కళ్యాణ్?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×