E-Paper
Advertisement

గ్రీన్ ఎనర్జీ వైపు ‘అల్లు సినిమాస్’ అడుగులు.. కోకాపేట మల్టీప్లెక్స్‌లో భారీ సోలార్ ప్రాజెక్ట్!

గ్రీన్ ఎనర్జీ వైపు ‘అల్లు సినిమాస్’ అడుగులు.. కోకాపేట మల్టీప్లెక్స్‌లో భారీ సోలార్ ప్రాజెక్ట్!
Advertisement

Allu Cinemas: పర్యావరణ పరిరక్షణతో పాటు క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్’ సరికొత్త పంథాను ఎంచుకుంది. హైదరాబాద్‌లోని ఐటీ హబ్, కోకాపేటలో సరికొత్తగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ పర్యావరణ హితంగా మారేందుకు గ్రీన్ ఎనర్జీ వైపు ముందడుగు వేసింది. ఇందుకోసం దేశంలోనే ప్రముఖ రూఫ్‌టాప్ సోలార్ సంస్థ అయిన ‘ఫ్రేయర్ ఎనర్జీ’ తో అల్లు సినిమాస్ యాజమాన్యం చేతులు కలిపింది. థియేటర్ సముదాయంపై భారీ ఎత్తున సోలార్ పవర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

Read also-‘పెద్ది’ తర్వాత బుచ్చి బాబు ఏం చేయబోతున్నారో తెలుసా?.. దాని కోసమే..

727 kW సామర్థ్యం!

Advertisement

మల్టీప్లెక్స్ భవనంపై దాదాపు రూ. 2,27,60,000 (రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై వేలు) భారీ పెట్టుబడితో, 727 kW సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా లభించే విద్యుత్, మల్టీప్లెక్స్‌కు అవసరమైన మొత్తం విద్యుత్ వినియోగంలో దాదాపు 60 శాతం వరకు అవసరాలను తీర్చనుంది.

రూ.80 లక్షల వరకు ఆదా!

ఈ సోలార్ ప్రాజెక్ట్ వల్ల అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌కు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం వస్తున్న కరెంట్ బిల్లుల అంచనా ప్రకారం.. ఏడాదికి అయ్యే విద్యుత్ ఖర్చు రూ. 52 లక్షల నుండి కేవలం రూ. 5 లక్షలకు తగ్గిపోనుంది. నిర్వహణ ఖర్చులు, ఇతర ఆదాలతో కలిపి ఓవరాల్‌గా సంవత్సరానికి రూ.77 లక్షల నుండి రూ.80 లక్షల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Read also-ఓటీటీని షేక్ చేస్తున్న ‘అవతార్ 2’.. హోమ్ వ్యూయర్స్ అస్సలు వందలడంలేదుగా..

పర్యావరణానికి మేలు..

ఈ ప్రాజెక్ట్ కేవలం ఆర్థికంగానే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేయనుంది. ఈ గ్రీన్ ఇనిషియేటివ్ ద్వారా ప్రతి ఏటా దాదాపు 750 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలు తగ్గుతాయి. అంతేకాకుండా, సోలార్ ప్యానెల్స్ ఎల్లప్పుడూ సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా.. వాటిని శుభ్రం చేయడానికి అత్యాధునిక ‘ఆటోమేటెడ్ హై-ప్రెజర్ స్ప్రింక్లర్ సిస్టమ్’ను ఇక్కడ ఏర్పాటు చేశారు. “సాధారణంగా మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని ఆప్టిమైజ్ చేయడంతో పాటు, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము తీసుకున్న ప్రాక్టికల్ నిర్ణయం ఇది. ఫ్రేయర్ ఎనర్జీతో కలిసి ఈ గ్రీన్ ప్రాజెక్ట్‌ను చేపట్టడం సంతోషంగా ఉంది.” అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని వినోద గమ్యస్థానాలు ఇలాంటి పర్యావరణ హితమైన అడుగులు వేయడానికి ‘అల్లు సినిమాస్’ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రోల్ మోడల్‌గా నిలవనుంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×