Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న బుచ్చిబాబు.. ‘పెద్ది’ తర్వాత తన ప్లాన్స్ ఏంటనేదానిపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Read also-హీరో దర్శన్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. జీవితాంతం జైల్లోనేనా..?
ఒక భారీ స్టార్ సినిమాను హ్యాండిల్ చేయడం, అదీ గ్లోబల్ వైడ్ క్రేజ్ ఉన్న రామ్ చరణ్‌తో ప్రాజెక్ట్ అంటే దర్శకుడిపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. స్క్రిప్ట్ వర్క్ దగ్గరనుంచి, ప్రొడక్షన్, షూటింగ్ గాయాలు, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు గత కొన్ని సంవత్సరాలుగా అహర్నిశలూ కష్టపడుతున్నారు. అందుకే, ఈ సినిమా పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు, కథల గురించి ఆలోచించకూడదని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారట.
సినిమా రిలీజ్ హడావుడి మొత్తం ముగిసిన వెంటనే బుచ్చిబాబు టోటల్‌గా ఇండస్ట్రీకి, ఈ గ్లామర్ ప్రపంచానికి కాస్త బ్రేక్ ఇచ్చి తన సొంత ఊరైన గోదావరి జిల్లాలోని రావులపాలెం వెళ్లిపోనున్నట్లు తెలిపారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు పడ్డ శ్రమకు కాస్త విరామం ఇచ్చి, తన ఇంట్లో వాళ్లతో, పాత స్నేహితులతో సరదాగా గడుపుతూ కాస్త ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Read also-సర్కార్ డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో.. అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!
సాధారణంగా ఒక పెద్ద హిట్ పడగానే దర్శకులు తమ తదుపరి సినిమాలను లైన్‌లో పెట్టేందుకు కథల చర్చలు, ఆఫీస్ చుట్టూ తిరగడం లాంటివి చేస్తుంటారు. కానీ బుచ్చిబాబు మాత్రం అలా కాకుండా, మానసికంగా, శారీరకంగా కాస్త రీఛార్జ్ అవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తన పుట్టిన ఊరి వాతావరణంలో, కుటుంబ సభ్యుల మధ్య గడిపితే వచ్చే ఎనర్జీ వేరని, ఆ తర్వాతే తన తదుపరి సినిమాపై దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా, బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సృష్టించబోయే రికార్డుల హోరును ఎంజాయ్ చేస్తూ, బుచ్చిబాబు తన సొంత ఊరి గోదావరి గట్టున ప్రశాంతంగా లంచ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట!