E-Paper
Advertisement

Allu Arjun: తమ్ముడి పెళ్లి.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన బన్నీ.. గెస్ట్లుగా ఎవరంటే?

Allu Arjun: తమ్ముడి పెళ్లి.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన బన్నీ.. గెస్ట్లుగా ఎవరంటే?
Advertisement

Allu Arjun: అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే .మార్చి 6వ తేదీన ప్రముఖ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) తన ప్రేయసి నయానికా రెడ్డి (Nayanika reddy) తో ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పత్రికలు కూడా పంచడం మొదలు పెట్టేసారు. అందులో భాగంగానే మొదటి పెళ్లి పత్రికను అల్లు శిరీష్ తన తల్లిదండ్రులతో కలసి తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని , మేనత్త సురేఖ కొణిదెల (Surekha konidela) కలసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తమ్ముడి పెళ్లి.. అన్నయ్య గ్రాండ్ పార్టీ..

దీనికి తోడు అల్లు శిరీష్ తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం దుబాయిలో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిపారు. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ వివాహం సందర్భంగా తమ్ముడి పెళ్లి కోసం అల్లు అర్జున్ హైదరాబాదులో గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అల్లు అర్జున్ హైదరాబాదులో ప్రైవేటు ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెగా – అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.. ముఖ్యంగా రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్పెషల్ అట్రాక్షన్ గా మెగా దంపతులు..

Advertisement

పైగా అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహారెడ్డి, అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయనికా రెడ్డి, రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి దిగిన గ్రూపు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇకపోతే అందరూ ఇక్కడ బ్లాక్ డ్రెస్ కోడ్ లో మెరిసారు. ఇక రాంచరణ్ మరోసారి అయ్యప్ప మాల ధరించి కనిపించడంతో అల్లు – మెగా ఫాన్స్ ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు . ఈ పార్టీకి సంబంధించిన అతిధుల జాబితా కూడా వైరల్ అవుతోంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు యంగ్ హీరోలు, హీరోయిన్లు ఈ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది.

అందరి దృష్టిని ఆకర్షించిన ఉపాసన..

ఇదిలా ఉండగా మరొకవైపు మెగా – అల్లు కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి సందడి చేశారు. పసుపు దంచే వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా కోడలు ఉపాసన (Upasana ) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వీడియోని అల్లు శిరీష్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తొలిసారి ఆమె ఇలా ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపించడం విశేషం.. ఇటీవలే తమ పిల్లలకు నామకరణం కూడా చేశారు. శిరీష్ నయానిక వివాహం మార్చి ఆరవ తేదీన జరగనుండగా వేదిక వివరాలు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది . ఏది ఏమైనా ఇన్ని రోజులు మెగా – అల్లు కుటుంబంలో విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు ఈ వేడుక పూర్తిగా చెక్ పెట్టింది అని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ; Chinmayi: నీ తండ్రి నిన్ను రే*ప్ చేసింటాడు.. దిమ్మతిరిగేలా చిన్మయి సమాధానం!

 

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×