E-Paper
Advertisement

TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!

TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!
Advertisement

TG Anganwadi Centres: స్వేఛ్చ బ్యూరో: గ్రామాలలో నిరుపేదల పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే దిశగా పథకంలో పలు మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ లకు అప్పగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లోని చిన్నారులు గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే సిబ్బంది సమయపాలన మెరుగు పడడంతో పాటు అక్రమాలకు చెక్ పడనుందనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.

సర్పంచ్ చైర్మన్ గా..

అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణకు సంబంధించి 11 మందితో కమిటీని ఏర్పాటు చేయనున్నారు ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్ గా, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు, రిటైర్డ్ ఉద్యోగి చిన్నారుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు.

Advertisement

Also Read: AI save Elephants: 270 ఏనుగులను కాపాడిన ఏఐ టెక్నాలజీ.. ఏం జరిగిందంటే

అక్రమాలకు చెక్..

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే కొన్ని కేంద్రాలలో టీచర్లు,ఆయాలు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే సమయపాలన పండించకపోవడం కొంతమంది కేంద్రానికి రాకపోవడం, హాజరు వేసుకొని ఇంటి బాట పట్టడం సొంత పనుల్లో బిజీగా ఉండడంతో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది చిన్నారులకు ఆటపాటలతో విద్యా అందించాల్సి ఉండగా వారిని కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకువచ్చే బాధ్యత ఉన్నప్పటికీ విస్మరిస్తున్నారనే చర్చ నడుస్తోంది.అలాగే చిన్నారులకు ఇచ్చే మురుకులు, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదనే అరోపణలు ఉన్నాయి. ఆరోగ్య లక్ష్మీ పథకం కింద గర్భిణీలు బాలింతలతో పాటు మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు భోజనం పెట్టాలి. ఉడికించిన గుడ్డు ఇవ్వాలి.అయితే కొంతమంది టీచర్లు లబ్ధిదారుల ఇంటికి ఇవ్వడంతో వాటిని ఇంటిల్లిపాది వినియోగిస్తున్నారు. దీంతో గర్భిణీలు బాలింతలకు పౌష్టి కాహారం అందడం లేదు. అయితే ఈ కమిటీతో ఇలాంటి వాటికి చెక్ పడనుందనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం .

పర్యవేక్షణతో గాడిన పడేనా..

Advertisement

సర్పంచ్ కు అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో కేంద్రాలు గాడిన పడుతాయని పలువురు లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు. ఆయా కేంద్రాలను ఐసిడిఎస్ పీడీతో పాటు సిడిపిఓలు, సూపర్వైజర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది వీరిలో చాలామంది కార్యాలయానికి పరిమితం కావడం చుట్టపుగా వచ్చి వెళ్లడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని లబ్ధిదారుల తల్లిదండ్రులు వాపోతున్నారు ఆయా కేంద్రాల్లో చిన్నారులు ఉండకపోయినా సరుకులను లబ్ధిదారులకు ఇచ్చినట్లుగా కొంతమంది నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్ తో పాటు కమిటీ సభ్యులు పర్యవేక్షించడంతో పూర్వ రాధ ఇక విద్య బలోపితం కానుంది. ఇక్కడ చదివిన పిల్లలను సర్కార్ బడిలో చేర్పించడంతో అందులోనూ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read: Maheshbabu: మహేష్ సమర్పణలో మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×