E-Paper
Advertisement

Anaganaga Oka Raju Collections: 100 కోట్ల క్లబ్ కి చేరువలో నవీన్ పోలిశెట్టి సినిమా..!

Anaganaga Oka Raju Collections: 100 కోట్ల క్లబ్ కి చేరువలో నవీన్ పోలిశెట్టి సినిమా..!
Advertisement

Anaganaga Oka Raju Collections: అనగనగా ఒక రాజు బాక్సాఫీస్ వద్ద గట్టి విజయాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటించగా, హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కనిపించింది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైనప్పటి నుంచే మంచి స్పందన తెచ్చుకుంది.

 

Advertisement

భారీ పోటీ ఉన్నా కూడా ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల కలెక్షన్లు నిలకడగా కొనసాగుతున్నాయి. నిర్మాతలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 61.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

అనగనగా ఒక రాజు కలెక్షన్స్..

Advertisement

 

పండుగ సీజన్ కావడం సినిమాకు మరింత లాభంగా మారింది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కథను సింపుల్‌గా చెప్పినా, వినోదం తగ్గకుండా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు.

 

ఈ చిత్రంలో రావు రమేష్, తరక్ పొన్నప్ప, గోపరాజు రమణ, రేవంత్, చమ్మక్ చంద్ర, భద్రం వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యం ఉండటంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. సహాయ పాత్రలు కూడా కథను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా నిలిచాయి.

 

ఈ సినిమాను నాగ వంశీ..సితార ఎంటర్‌టైన్‌మెంట్స్..తో పాటు సాయి సౌజన్య..ఫార్చూన్ ఫోర్ సినిమాస్…నిర్మించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించగా, పాటలు.. నేపథ్య సంగీతానికి మంచి స్పందన వస్తోంది.

 

ఇక దీంతో నవీన్ కి జాతి రత్నాలు సినిమా తర్వాత అనగనగా ఒక రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, ఇది నవీన్ పోలిశెట్టికి మరో పెద్ద హిట్‌గా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

 

అనగనగా ఒక రాజుకి పోటీ..

 

మరోపక్క ఈ సంక్రాంతికి విడుదలైన చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు చెరువులో ఉంది. అయితే ఆ సినిమా తర్వాత ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ప్రభాస్ రాజా సాబ్.. ఆ తరువాత నవీన్ అనగనగా ఒక రాజు చిత్రాలే ఎక్కువ సాధించేలా కనిపిస్తోంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి కి మంచి టాక్ ఉన్నా కానీ.. ఈ చిత్రానికి థియేటర్లో కొద్దిగా తక్కువ దొరకడంతో.. ప్రస్తుతం ఆ సినిమా కన్నా ముందంజులో ఉండి అనగనగా ఒక రాజు.

Also Read: Sankranthi Movies At US Box Office: అమెరికా బాక్సాఫీస్‌ దగ్గర సంక్రాంతి సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×