E-Paper
Advertisement

Anaganaga Oka Raju : ఆ సినిమాకు నిర్మాత నాగవంశీ ఇంప్రెస్.. డైరెక్టర్‌కి కాస్ట్లీ వాచ్ గిఫ్ట్

Anaganaga Oka Raju : ఆ సినిమాకు నిర్మాత నాగవంశీ ఇంప్రెస్.. డైరెక్టర్‌కి కాస్ట్లీ వాచ్ గిఫ్ట్
Advertisement

Anaganaga Oka Raju: సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బరిలోనే నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మరో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

డైరెక్టర్ కు నాగ వంశీ సర్ప్రైజ్ గిఫ్ట్..

కళ్యాణ్ శంకర్(Kalyan Shankar)  తెరకెక్కిన ఈ సినిమా వెడ్డింగ్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సెన్సార్ కాఫీ కోసం నాగ వంశీ ఈ సినిమాని చూశారట అయితే మొదటి హాఫ్ చూడగానే ఈ సినిమాకు ఎంతో ఇంప్రెస్ అయిన ఈయన డైరెక్టర్ కు ఊహించని కానుక ఇచ్చారని తెలుస్తోంది.

రూ.12 లక్షల విలువైన వాచ్..

Advertisement

ఇలా ఫస్ట్ హాఫ్ చూడగానే నాగ వంశీకి ఎంతగానో ఈ సినిమా నచ్చేసిందని, అందుకే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కోసం 12 లక్షల విలువైన కాస్ట్లీ వాచ్ గిఫ్టుగా ఇచ్చినట్టు సమాచారం. ఇలా ఖరీదైన కానుకతో దర్శకుడు పనితీరును నాగ వంశీ ప్రశంసించారని తెలుస్తోంది. ఇక ఇటీవల నాగ వంశీ నిర్మాణంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా పూర్తిగా తనని నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాది మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అనగనగా ఒక రాజు పైనే నాగ వంశీ ఆశలు..

Advertisement

ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నాగ వంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి సినిమా అంటేనే ప్రేక్షకులకు కావలసిన వినోదం ఉంటుందని చెప్పాలి. ఇప్పటివరకు నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనగనగా ఒక రాజు సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించడం విశేషం. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది అనగనగా ఒక రాజు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Nari Nari Naduma Murari: శర్వాకు కాస్త తుత్తర ఎక్కువే… నారీ నారీ నడుమ మురారి టీజర్ డేట్ లాక్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×