E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ విన్నర్ అతనే..? బిగ్ టీవీ పోలింగ్ లో ఆడియన్స్ ఏమన్నారంటే..?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ విన్నర్ అతనే..? బిగ్ టీవీ పోలింగ్ లో ఆడియన్స్ ఏమన్నారంటే..?
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో అంటే టక్కును గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. ఎస్ ప్రస్తుతం ఇదే పేరు అందరి నోటా వినిపిస్తుంది.. 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో తెలుగులో ప్రస్తుతం 9వ సీజన్ ప్రసారమవుతుంది. కేవలం ఒక్క రోజులోనే ఈ షో కు శుభం కార్డు పడబోతుంది.. ఇప్పటివరకు హౌస్లో ఎలాంటివి జరిగిన ఫైనల్స్ మాత్రం జనాల ఊహలకు అందని విధంగా జరుగుతున్నాయి.. టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో కొనసాగుతున్నారు. వీరిలో ఎవరు విన్నర్ ట్రోఫీని అందుకుంటారన్నది ఆసక్తిగా మారుతుంది. ఒక్క సంజన తప్ప మిగిలిన అందరు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో విన్నర్ ఎవరన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ నిర్వహించిన బిగ్ బాస్ పోలింగ్ లో ఆడియన్స్ ఒకరిని గెలిపించేందుకు ఉత్సహంగా ఉన్నారని తెలుస్తుంది.. ఆ వ్యక్తి ఎవరు? జనాలు ఎందుకు అతనికి ఓటు వేస్తున్నారన్నది ఒకసారి తెలుసుకుందాం..

Also Read :రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న నటి ఆమని.. ఏ పార్టీలో చేరుతుందంటే..?

బిగ్ బాస్ విన్నర్ అతనే.. 

Advertisement

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది.. కేవలం రెండు రోజుల్లోనే ఈ షో ముగియనుంది. ఈ క్రమంలో విన్నర్ ఎవరు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. గత సీజన్ నిఖిల్ విన్నర్ అవ్వగా గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. మరి ఈ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా బిగ్ టీవీ నిర్వహించిన బిగ్ బాస్ పోలింగ్ లో కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వాలని ఎక్కువ మంది ఓట్లు వేశారు. అతనికి 41 శాతం మంది ఓట్లు వెయ్యగా, తనూజ కు 36 %, ఇమ్మానుయేల్ కు 15 శాతం, సంజన, పవన్ లకు కేవలం 8 శాతం మాత్రమే ఓట్లు వేశారు. ఈ లెక్కన చూస్తే ఈ సీజన్ కు విన్నర్ గా కళ్యాణ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.. ఇప్పటికే ఇతను విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి విన్నర్ ఇతనా? తనూజ అన్నది ఒక్కరోజులో తెలిసే అవకాశం ఉంది.

తనూజ కి మొదలైన వ్యతిరేకత..

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 లో విన్నర్ గా ప్రముఖ సీరియల్ నటుడు నిఖిల్ నిలిచారు. ఈయన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటుడు. ఆటలో ఎంతగా ప్రతిభను కనబరిచిన సరే తెలుగు వాళ్లకి ట్రోఫీని ఇవ్వకుండా కన్నడ వాళ్లకి ట్రోఫీ ఇవ్వడంపై బిగ్ బాస్ పై తెలుగు ఆడియన్స్ విమర్శలు గుప్పించారు. తెలుగు వాళ్లు కూడా బాగానే ఆడుతున్నారు. కానీ కన్నడ నటుడు కు ఇవ్వడమేంటి అని ఈ షో పై వ్యతిరేకత మొదలైంది. కానీ ఈ ట్రోల్స్ పై బిగ్ బాస్ యాజమాన్యం పెద్దగా స్పందించలేదు. ఈ సీజన్ కు కూడా అలాంటి వ్యతిరేకత జనాల్లో కనిపిస్తుంది. దాంతో తనూజ విన్నర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి రన్నర్ గా అయిన ఈమె నిలుస్తుందా? లేదా అన్నది కేవలం ఒక్కరోజులో తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×