Anantha Sriram: అనంత శ్రీరామ్.. ఈ పేరు ప్రేక్షకులకు పరిచయమే. తాజాగా ఆయన సాహిత్యం అందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన ‘పెద్ది’ (Peddi Movie) సినిమాలోని ‘రై రై రా రా’ సాంగ్ ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో తెలిసిందే. అర్థవంతమైన సాహిత్యంతో వచ్చిన ఈ పాటను అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ, చార్ట్‌బస్టర్‌గా దూసుకెళుతోంది. అంతేనా, రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్, దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్ వైరల్ హిట్‌గా అదరగొడుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన ‘రై రై రా రా’ సాంగ్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) మీడియా ద్వారా తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన చిరు, రామ్ చరణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read- Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ఖర్చు ఎంతో తెలుసా..పెళ్ళి ఖర్చు మొత్తం తనదేనా?
ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘మెగా ఫ్యామిలీని నాకు మొదటి నుంచి మంచి అసోసియేషన్ ఉంది. పాటల రచయితగా తొలిసారి నా పేరు చూసుకున్న తొలి చిత్రం మెగాస్టార్ హీరోగా నటించిన ‘అందరివాడు’. ఒక ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోతో ప్రయాణం అనేది గొప్ప అదృష్టం. అలాంటిది అదే ఫ్యామిలీకి చెందిన రెండో తరం హీరోతో కూడా అంత మంచి పాట రావడం అనేది ఇంకా అదృష్టం. మరో అద్భుతమైన అదృష్టమేమిటంటే.. ఒకే సంవత్సరంలో మెగాస్టార్ సినిమా, అలాగే వాళ్లబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా.. ఇలా రెండు పెద్ద హిట్స్ రావడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇది రేర్‌గా వచ్చే అదృష్టం. అలాంటి లిస్ట్‌లో నేను ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది.
Also Read- Band Melam Film: శ్రీరామనవమికి వస్తున్న ‘బ్యాండ్ మేళం’.. ఈ సారైనా పక్కాగా వస్తారా?
ఇక మెగాస్టార్ చిరంజీవి.. ఒక తండ్రిలాగా అందరికీ ప్రేమను పంచుతారు. అలాగే చరణ్ సోదర సమానంగా ప్రేమ పంచుతారు. మనుషులంటే వాళ్ళిద్దరికీ చాలా ప్రేమ. నేనే కాదు ఎదురుగా ఒక మనిషి ఉంటే చరణ్ కళ్ళల్లో ప్రేమ పొంగుతుంది. మనిషిని ప్రేమించే తత్వం అది. చరణ్ ప్రతి నిమిషం కష్టపడే వ్యక్తి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ఐరన్ మ్యాన్ రామ్ చరణ్. ‘పెద్ది’ సినిమాకు ఇంకా మూడు పాటలు రాశాను. త్వరలోనే అవి విడుదలవుతాయి. అవి కూడా చాలా బాగుంటాయి. బాలాజీ రాసిన ‘చికిరి చికిరి’, ఈ ‘రై రై రారా’ పాట ఎంత వైవిధ్యంగా వున్నాయో.. మిగతా పాటలు కూడా దేనికవే ప్రత్యేకంగా వుంటాయి. నా పాట విని ఆత్మహత్యను విరమించుకునే సందర్భం రావాలి. అలాంటి పాట రాస్తే నా రచన సార్థకమైనట్లే అని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆ లక్షణం ఈ ‘రై రై రారా’ పాటకి కనిపిస్తోంది..’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Dhurandhar 2: ధురంధర్ ఎఫెక్ట్.. దెబ్బకు వెనక్కి తగ్గిన మూవీస్.. లిస్ట్ వైరల్!