Anasuya Bharadwaj: ఇటీవల సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు, అవమానాలు, వేధింపులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ విషయంలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆన్లైన్‌లో ఆమెను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన 73 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన మహిళల భద్రత, సోషల్ మీడియా బాధ్యతపై మరోసారి ఆలోచింపజేస్తోంది.
అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. తన మాటలతో, ఆత్మవిశ్వాసంతో ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. ఆ వ్యాఖ్యలు మహిళలను.. కించపరిచేలా ఉన్నాయని అనసూయ బహిరంగంగా స్పందించారు. మహిళలు ఏమి ధరించాలన్నది వారి వ్యక్తిగత ఇష్టం అని, దానిపై ఇతరులు తీర్పులు చెప్పే హక్కు లేదని ఆమె స్పష్టంగా చెప్పారు.
ఈ విషయంపై అనసూయ మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. విమర్శల స్థాయిని దాటి వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు పెరిగాయి. కొందరు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల పేరుతో కూడా అనసూయను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా “చీర ఛాలెంజ్” అంటూ చేసిన వీడియోలు మహిళా లోకాన్ని ఆగ్రహానికి గురిచేశాయి.
ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి బహిరంగంగా స్పందించారు. ఒక మహిళను మరో మహిళ ఇలాంటి రీతిలో అవమానించడం చాలా బాధాకరమని ఆమె అన్నారు. వస్త్రధారణ పేరుతో మహిళలను వేధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్ఛలపై మాట్లాడాల్సిన నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చిన్మయి ప్రశ్నించారు. ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. అనసూయపై ఆన్లైన్‌లో దూషణలు చేసిన 73 మందిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. వ్యక్తిగతంగా ఎవరినైనా అవమానించడం, బెదిరించడం, వేధించడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: Peddi: రికార్డు సృష్టించిన పెద్ది “చికిరి చికిరి” సాంగ్.. మొత్తం అన్ని భాషల్లో కలిపి!