E-Paper
Advertisement

Anil Ravipudi: జన నాయగన్ భగవంత్ కేసరి రీమేక్.. నిజం దాచి పెట్టారన్న అనిల్ రావిపూడి!

Anil Ravipudi: జన నాయగన్ భగవంత్ కేసరి రీమేక్.. నిజం దాచి పెట్టారన్న అనిల్ రావిపూడి!
Advertisement

Anil Ravipudi: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అనిల్ రావిపూడికి ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

భగవంత్ కేసరి రీమేక్ సినిమా..

హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ దళపతి నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.. అయితే ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాని పోలి ఉండడంతో ఈ సినిమా కచ్చితంగా భగవంత్ కేసరి రీమేక్ సినిమా అంటూ వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ వార్తలపై దర్శకుడు హెచ్ వినోద్ స్పందిస్తూ ఇది ఏ సినిమాకు రీమేక్ సినిమా కాదని ,పూర్తిగా విజయ్ సినిమా అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: Jana Nayagan Record: జన నాయగనన్ విడుదల వేళ.. కొత్త రికార్డు సృష్టించిన విజయ్!

నిజాని దాచి పెట్టారు..

ఇదే విషయంపై మన శంకర వరప్రసాద్ ప్రమోషన్లలో భాగంగా అనిల్ రావిపూడికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి స్పందిస్తూ.. నిజానికి ఈ సినిమా విషయంలో డైరెక్టర్ చాలా దాచి పెట్టారని అనిల్ రావిపూడి తెలియజేశారు కొంతమంది ఈ సినిమా రీమేక్ అంటున్నప్పటికీ మరి కొంతమంది కాదని చెబుతున్నారు. దర్శకుడు హెచ్ వినోద్ గారు కూడా ఇది పూర్తిగా విజయ్ గారి సినిమా అని తెలియజేశారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం విజయ్ సినిమా గానే ట్రీట్ చేద్దామని అనిల్ రావిపూడి తెలియజేశారు.

Advertisement

విజయ్ గారి ఆఖరి సినిమా..

ఇక విజయ్ తో తన పరిచయం గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఆయనని వారిసు సినిమా షూటింగ్ సమయంలో కలిశానని, ఆయన ఇప్పుడు రాజకీయాల పరంగా వెళుతూ ఆఖరిగా జననాయగన్ సినిమాలో నటిస్తున్నారు. మరి విజయ్ గారి ఆఖరి సినిమాలో నా పాత్ర ఉందా? లేదా? అనేది విడుదలయ్యాక ఖచ్చితంగా తెలుస్తుందని అనిల్ రావిపూడి తెలియజేశారు. అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ మాత్రం కచ్చితంగా భగవంత్ కేసరి సినిమా సన్నివేశాలను పోలి ఉండడంతో పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి.

Also Read: MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారిలో వెంకటేష్ పాత్ర ఎప్పుడో రివీల్ చేసిన డైరెక్టర్..

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×