E-Paper
Advertisement

Vemulawada: కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న చిరుత.. భయం గుప్పిట్లో వేములవాడ ప్రజలు, ముఖ్యంగా ఈ గ్రామాల్లో..?

Vemulawada: కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న చిరుత.. భయం గుప్పిట్లో వేములవాడ ప్రజలు, ముఖ్యంగా ఈ గ్రామాల్లో..?
Advertisement

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. గత కొంతకాలంగా జిల్లాలోని వివిధ మండలాల్లో కనిపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత, తాజాగా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామ శివారులో ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్థులు, ముఖ్యంగా రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.

రైస్ మిల్లు వద్ద ప్రత్యక్షమైన చిరుత

Advertisement

హనుమాజీపేట శివారులోని ఒక రైస్ మిల్లు సమీపంలో చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. మిల్లులో పనిచేసే ప్రదీప్ కుమార్ అనే కూలీ పనుల నిమిత్తం బయటకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా చిరుత ఎదురుపడింది. ఎదురుగా ఉన్నది క్రూర మృగం అని గ్రహించిన ప్రదీప్, ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీశాడు. వెంటనే విషయాన్ని తోటి కార్మికులకు, గ్రామస్థులకు తెలియజేయడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు

Advertisement

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైస్ మిల్లు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అక్కడ చిరుతపులి అడుగు జాడలను గుర్తించారు. అవి చిరుతపులి అడుగులేనని నిర్ధారించడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చిరుత ఏ సమయంలో ఎటువైపు నుంచి వస్తుందో తెలియక జనం గడగడలాడుతున్నారు.

అటవీ శాఖ హెచ్చరికలు

చిరుత సంచారం దృష్ట్యా అటవీ శాఖ అధికారులు హనుమాజీపేట, చుట్టుపక్కల గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. రాత్రి సమయాల్లో ఇళ్ల బయట పడుకోవద్దని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. గుంపులుగా వెళ్లడం వల్ల క్రూర మృగాల దాడి నుండి తప్పించుకోవచ్చని వారు అవగాహన కల్పించారు.

జిల్లాలో విస్తరిస్తున్న చిరుత భయం

కేవలం వేములవాడ రూరల్ మాత్రమే కాకుండా.. జిల్లాలోని చందుర్తి, కోనారావుపేట, రుద్రంగి మండలాల్లో కూడా గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పశువులపై దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హనుమాజీపేటలో చిరుత కనిపించడంతో.. జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Jangaon Collector: పాపం ఈ రైతు.. సమస్య కోసం కలెక్టర్ కాళ్లపై పడ్డాడు.. మరీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా..?

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×