E-Paper
Advertisement

‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి ఖాతాలో మరో అవార్డ్.. సంక్రాంతి సందడి ఇంకా తగ్గలా..

‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి ఖాతాలో మరో అవార్డ్.. సంక్రాంతి సందడి ఇంకా తగ్గలా..
Advertisement

Anil Ravipudi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘సక్సెస్’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయం ఎరుగని దర్శకుడిగా, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న ఆయన కీర్తి కిరీటంలో మరో అరుదైన మైలురాయి వచ్చి చేరింది. ప్రతిష్టాత్మక ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA 2026) అవార్డులలో అనిల్ రావిపూడి ‘ఉత్తమ దర్శకుడు’ పురస్కారాన్ని అందుకున్నారు.

Read also-మంగ్లీ కేసులో భారీ ట్విస్ట్.. నిందితుడు మధు అరెస్ట్?

బాక్సాఫీస్ విన్నర్..

Advertisement

గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు అసలైన పండుగ వినోదాన్ని అందించింది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, పాత్రల చిత్రణలో చూపిన నైపుణ్యానికి గాను అనిల్ రావిపూడిని ఈ గౌరవం వరించింది.

ప్రస్థానం

దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం ‘పటాస్’ నుండి నేటి వరకు అనిల్ రావిపూడి వెనుదిరిగి చూసుకోలేదు. మాస్ యాక్షన్ అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా తనదైన ‘హ్యూమర్’ జోడించి సినిమాను హిట్‌గా మార్చడం ఆయన శైలి. ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో ఆయన టాలీవుడ్‌లో అత్యంత నమ్మకమైన దర్శకుడిగా ఎదిగారు. సామాన్య ప్రేక్షకుడికి ఏం కావాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తాయి.

Advertisement

Read also-జాతీయ స్థాయి అవార్డ్ గెలుచుకున్న బుల్లిరాజు.. అనిల్ రావిపూడి ఎమోషనల్..

INCA 2026 వేడుకలో అభినందనల జల్లు

ముంబైలో వైభవంగా జరిగిన INCA 2026 అవార్డుల ప్రధానోత్సవంలో అనిల్ రావిపూడి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచిన నిర్మాతలకు, హీరోలకు ముఖ్యంగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలతో అలరిస్తానని ఆయన పేర్కొన్నారు. “కేవలం వినోదం మాత్రమే కాకుండా, బలమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించడమే నా లక్ష్యం.” అని అనిల్ రావిపూడి అన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన అనిల్ రావిపూడికి సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు మరియు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×