E-Paper
Advertisement

MSVPG film: ‘మనదే సంక్రాంతి’ లిరిక్ అందుకే మార్చారా ..ప్రభాస్ చెప్పాకే?

MSVPG film: ‘మనదే సంక్రాంతి’ లిరిక్ అందుకే మార్చారా ..ప్రభాస్ చెప్పాకే?
Advertisement

MSVPG film: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi)నయనతార(Nayanthara) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదల అవుతుండగా 11వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా అదే తరహాలో నిర్వహిస్తూ ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

ఏంది వెంకీ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి..

ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ చిరంజీవి మధ్య వచ్చే పాటకు సంబంధించిన లిరిక్ గురించి చర్చలు జరిగాయి. ఈ పాటలో భాగంగా “ఏంది వెంకీ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి”అంటూ సాగిపోతుంది అయితే ఇందులో భాగంగా.. “ఏంది వెంకీ సంగతి.. మనదే సంక్రాంతి”అని లిరిక్స్ రాయగా దీనిని మార్చి అదిరిపోద్ది సంక్రాంతి అని పెట్టారు. ఇలా పెట్టడానికి గల కారణం ఏంటి అంటూ అనిల్ రావిపుడికి ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనిల్ సమాధానం చెబుతూ అసలు విషయాన్నీ బయట పెట్టారు.. ఈ పాట కాసర్ల శ్యామ్ గారు రాశారు షూటింగ్ కూడా అయిపోయింది అయితే ఈ పాట ఒకటికి రెండుసార్లు మేము విన్నప్పుడు “మనదే సంక్రాంతి”అనే పదం కాస్త ఇబ్బందిగా అనిపించిందని తెలిపారు..

ప్రభాస్ చెప్పకముందే ..

Advertisement

మన సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని వారి చేత ఇలాంటివి చెప్పించడం సరికాదని” ఏంటి వెంకీ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి” అని మార్చినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ప్రభాస్ సంక్రాంతి సినిమాల గురించి తన సినిమా ఈవెంట్లో చెప్పిన తర్వాత మార్చారా? అంటూ ప్రశ్న వేయగా ప్రభాస్ తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సంక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలని, సీనియర్ల తర్వాతే మనము అనే విషయం చెప్పక ముందే మార్చామని అనిల్ రావిపుడి చెప్పారు. ఈ పాటలో మనదే సంక్రాంతి అని చెప్పడం మరో విధంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అందుకే మార్చామని అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక ఈ సినిమా విషయంలో వచ్చిన విమర్శల గురించి కూడా ఈయన స్పందిస్తూ ఎంతోమంది మనల్ని ఆదరిస్తున్నప్పుడు వచ్చే విమర్శల గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: Samantha: సమంత మా ఇంటి బంగారం టీజర్ పై ఆడపడుచు రివ్యూ..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×