E-Paper
Advertisement

Samantha: సమంత మా ఇంటి బంగారం టీజర్ పై ఆడపడుచు రివ్యూ..

Samantha: సమంత మా ఇంటి బంగారం టీజర్ పై ఆడపడుచు రివ్యూ..
Advertisement

Samantha: సినీనటి సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా చాలా యాక్టివ్ అయ్యారని చెప్పాలి. తన వ్యక్తిగత విషయాలు ద్వారా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలోను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు అలాగే కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఈమె తన సొంత నిర్మాణ సంస్థ ఆయన ట్రాలాల నిర్మాణ సంస్థలో నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

మా ఇంటి స్వచ్ఛమైన బంగారం..

ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సమంత నటనపై మరోసారి ప్రశంశల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకు సమంత హీరోయిన్గా కాకుండా హీరో రేంజ్ లో యాక్షన్ సన్ని వేశాలలో నటించారు అంటూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత ఆడపడుచు సీతల్ నిడిమోరు(Seetal Nidimoru) సైతం ఈ సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా టీజర్ ను ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ “మా ఇంటి స్వచ్ఛమైన బంగారం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది.

సమంత నువ్వు గెలిచావు..

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా శీతల్ తో పాటు తన ఇద్దరు కొడుకులు కూడా సందడి చేశారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా శీతల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ “మా ఇంటి బంగారం” అనే క్యాప్షన్ ఇవ్వడంతో సమంతకు తన అత్తగారి ఇంటి నుంచి ఎలాంటి ఆప్యాయత లభించిందో స్పష్టం అవుతుంది. సమంత నువ్వు నీ లైఫ్ లో గెలిచావు అత్తింటి నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం చాలా పెద్ద విషయం అక్కడే నువ్వు గెలిచావ్ అంటూ అభిమానులు కూడా కామెంట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

?igsh=MW5oaDY4YWJzZ2h4ag%3D%3D

Advertisement

సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరుతో రెండవ వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా రెండో వివాహ సమయంలో తన అత్తింటి వారు ఎంతో సంతోషంగా పాల్గొని ఈ పెళ్లి వేడుకను జరపడమే కాకుండా సమంతకు ఎంతో ఘనంగా ఆహ్వానం పలికారు. ఇక ఈ పెళ్లి సమయంలో రాజ్ సోదరి సమంత పట్ల ఎంతో ప్రేమను కురిపించిన సంగతి తెలిసిందే. ఇలా అత్తింటి వారి నుంచి సమంతకు లభిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలు చూసిన అభిమానులు ఎల్లప్పుడూ సమంత ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Fake Reviews Rating: ఇక నో ఫేక్ రేటింగ్స్.. నో ఫేక్ రివ్యూ… చిరు మూవీ నుంచే కొత్త ప్రయోగం

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×