E-Paper
Advertisement

Anil Ravipudi: పిల్లలకు ఆ రీల్స్ చూపించొద్దు.. పేరెంట్స్ ను రిక్వెస్ట్ చేసిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi: పిల్లలకు ఆ రీల్స్ చూపించొద్దు.. పేరెంట్స్ ను రిక్వెస్ట్ చేసిన అనిల్ రావిపూడి!
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు (MSVPG)సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ తో పాటు నిర్మాతలు కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

దయచేసి ఆ రీల్ చూపించొద్దు..

ఇకపోతే అనిల్ రావిపూడి పదవ సినిమా గురించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ తెలియజేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టైటిల్ ఫిక్స్ అయ్యానని త్వరలోనే ఈ టైటిల్ తో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయని అనిల్ రావిపుడి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించిన రీల్స్ గురించి మాట్లాడారు. సాధారణంగా ఒక స్టెప్ లేదా ఒక సాంగ్ మంచి హిట్ అయింది అంటే సోషల్ మీడియాలో కొన్ని వేల రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తుంటారు.

మద్యపానం మహాదానందం..

Advertisement

ఈ నేపథ్యంలోనే చిరంజీవి హుక్ స్టెప్స్ , మీసాల పిల్ల పాటకు సంబంధించి ఎన్నో రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సినిమాలోని పాటలకు రీల్స్ ద్వారా వస్తున్న ఆదరణకు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ చిరంజీవి మధ్య వచ్చే ఒక డైలాగ్ కూడా మంచి ఫేమస్ అయింది. “మద్యపానం మహాదానందం” అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అయిందని, పిల్లలకు ఈ డైలాగు చూపించొద్దు అలాగే వారి చేత రీల్స్ చేయించొద్దని అనిల్ రావిపూడి రిక్వెస్ట్ చేశారు. వినోదాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి సూచించారు.

సంక్రాంతి హిట్ మిషన్..

Advertisement

ఇక అనిల్ రావిపూడి పటాస్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పటివరకు 9 సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ తొమ్మిది సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడంతో అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవల వరుస సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టడంతో సంక్రాంతి హిట్ మిషన్ అంటూ ఈయనకు సరికొత్త బిరుదులను కూడా ప్రకటిస్తున్నారు. ఇక శంకర్ ప్రసాద్ గారు మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి తదుపరి హీరో ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈయన దాదాపు వెంకటేష్ రాణాతో కలిసి ఒక మల్టీ స్టార్ చేయబోతున్నట్టు సమాచారం.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ ఇంటిని చూశారా.. వైరల్ అవుతున్న హోమ్ టూర్ వీడియో..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×