Keerthy Suresh: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే కీర్తి సురేష్ తాజాగా తన భర్త ఆంటోనీ తట్టిల్(Antony Thattil) తో కలసి తన హోమ్ టూర్ వీడియో(Home Tour Video) షేర్ చేశారు. ఏషియన్ పెయింట్స్ నిర్వహిస్తున్న ‘వేర్ ది హార్ట్ ఈజ్ – సీజన్ 9’లో భాగంగా ఆమె కొచ్చిలోని తన సొంత ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో చేశారు.
కేరళ సాంప్రదాయాలకు అనుగుణంగా,తన అభిరుచులకు అనుగుణంగా కీర్తి సురేష్ ఈ ఇంటిని నిర్మించుకున్నారని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలి అంటే ఇంద్ర భవనం లాంటి ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ ఇంటిలో కీర్తి సురేష్ తన చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నిటిని కూడా ఎంతో అందంగా భద్రపరుచుకోవడం అందరిని ఆకట్టుకుంది. ఇక తన భర్త ఆంటోనీతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు జ్ఞాపకాలను మెమోరీ వాల్ పేరుతో ఈ ఇంటిలో ఎంతో అందంగా అలంకరించుకున్నారు.
కీర్తి సురేష్ తన ఇంటికి “హౌస్ ఆఫ్ ఫన్” అని పేరు పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఇంటిలోని ఫర్నిచర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తన ఇంట్లో ప్రతి విషయాన్ని కీర్తి సురేష్ క్లుప్తంగా తెలియజేస్తూ తన భర్తతో కలిసి ఈ హోమ్ టూర్ వీడియోని షేర్ చేశారు .ఇందులో భాగంగా తన పెట్ డాగ్స్ ను కూడా పరిచయం చేయడమే కాకుండా తన నైక్ కోసం ఏర్పాటు చేసిన గదిని కూడా ఈ సందర్భంగా చూపించారు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని ప్రకృతి నడుమ కీర్తి సురేష్ ఇల్లు ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇలా మొదటిసారి ఆమె తన భర్తతో కలిసి ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
ఇక కీర్తి సురేష్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్దన్ అనే సినిమాలో నటిస్తున్నారు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని తమిళ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల రివాల్వర్ రీటా అనే సినిమా ద్వారా కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక కీర్తి సురేష్ 2024 డిసెంబర్లో తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం గోవాలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది.
Also Read: Akira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్.. ఏమైందంటే?