E-Paper
Advertisement

బన్నీ మూవీ కోసం అనిరుధ్ భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!

బన్నీ మూవీ కోసం అనిరుధ్ భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
Advertisement

Anirudh: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్5 సొంతం చేసుకున్న అనిరుధ్ రవిచందర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించి.. మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. సహజంగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు అంటే చాలా గట్టిగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు లోకేష్ కనగరాజ్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం చేస్తున్న డిమాండ్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాని ది ప్యారడైజ్ సినిమా కంటే 6 కోట్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రెండు చిత్రాలకే భారీ డిమాండ్..

ప్రస్తుతం అనిరుధ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ సినిమా కోసం సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈయనతో చేస్తున్న మూడవ సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలకు కేవలం అయిదారు కోట్ల రూపాయల లోపే రెమ్యూనరేషన్ తీసుకున్నారట అనిరుధ్. కానీ ది ప్యారడైజ్ కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా వచ్చేవారం ఒక లవ్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత మరొక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం.ఇక తన మ్యూజిక్ తో ఈ సినిమాకి మరింత ప్లస్ గా మారుతున్నారు అనిరుధ్. పైగా రెండు చిత్రాలతో మ్యూజికల్ పరంగా మంచి సక్సెస్ అందుకోవడం తోనే ఇప్పుడు ఈ మూడవ సినిమాకి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

బన్నీ మూవీ కోసం స్టార్ హీరో రేంజ్ లో రెమ్యూనరేషన్..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన 23వ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా 21 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన గ్లింప్స్ కి ఆయన అందించిన సంగీతం బాగుందని పేరు వచ్చింది. కానీ రూ.21 కోట్లు అంటే ఇది చాలా ఎక్కువ అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హీరోలతో సమానంగా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది ఈ అంశం.

ALSO READ:హారర్ మైథాలజీలోకి అలియా భట్.. పాత్ర ఏంటో తెలుసా?

బ్రాండ్ వ్యాల్యూ కోసమేనా?

Advertisement

ముఖ్యంగా అనిరుద్ తీసుకుంటున్న ఈ రెమ్యునరేషన్ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే అనిరుధ్ కి ఉన్న ఇమేజ్, ఆయనకు ఉన్న బ్రాండ్ వాల్యూ వల్ల సినిమాకి వచ్చే గుర్తింపు, జరిగే బిజినెస్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనుకాడడం లేదని సమాచారం ఏది ఏమైనా అనిరుద్ మాత్రం ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×