E-Paper
Advertisement

హారర్ మైథాలజీలోకి అలియా భట్.. పాత్ర ఏంటో తెలుసా?

హారర్ మైథాలజీలోకి అలియా భట్.. పాత్ర ఏంటో తెలుసా?
Advertisement

Alia Bhatt:ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఒకే పాత్రకి.. ఒకే జానర్ కి పరిమితం కాకుండా తమలోని టాలెంట్ ను నిరూపించుకోవడానికి విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అలా ఇప్పటికే వైవిద్య భరితమైన పాత్రలు కావాలని శ్రీ లీల ఇలా ప్రయత్నిస్తుంటే.. అటు రాశి ఖన్నా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యింది. ఇక ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా హారర్ మైథాలజీలోకి అడుగుపెడుతోందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోనే కాదు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ హారర్ మైథాలజీలో ఎలా నటించబోతోంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.

హారర్ మైథాలజీ లోకి అలియా భట్..

బాలీవుడ్ వర్సటైల్ నటీమణిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అలియా భట్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను నడుపుతోంది. ఆల్ఫా చిత్రంతో రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె విక్కీ కౌశల్, రణబీర్ కపూర్ తో కలిసి లవ్ అండ్ వార్ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హారర్ మైథాలజికల్ వండర్ గా వచ్చిన తుంబాడ్ సీక్వెల్ లో అలియా భట్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న ఈ తుంబాడ్ సీక్వెల్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుందని.. దానికోసం కొంతమంది స్టార్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించగా.. అందులో అలియా భట్ ను ఖరారు చేసినట్లు సమాచారం.

కథను మలుపు తిప్పే పాత్ర..

Advertisement

ఈ సినిమాలో అలియా పోషించే పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ.. కథను మలుపు తిప్పడానికి సినిమాపై బలమైన ప్రభావం చూపడానికి.. ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. త్వరలోనే అలియా భట్ పాత్రకు సంబంధించి షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు హారర్ మైథాలజీలో అలియా భట్ భాగం కాబోతోంది అని తెలిసి ఈమె పాత్ర ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ALSO READ:తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ ..టెన్షన్ లో విజయ్.. తిరుమలలో త్రిష!

అలియా భట్ కెరియర్..

Advertisement

అలియా భట్ విషయానికి వస్తే.. మహేష్ బట్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. తొలిసారి తెలుగులోకి ఆర్ఆర్ఆర్ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. 2014లో వచ్చిన హైవే సినిమాతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు హీరోయిన్గా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఆకట్టుకుంటూనే.. మరొకవైపు భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తోంది.. ఏది ఏమైనా అలియాబట్ ఇప్పుడు జానర్ మార్చి హారర్ మైథాలజీ మూవీలోకి అడుగుపెట్టడంతో ఈ పాత్ర ఎలా ఉంటుందో అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×