Anjali Interview: అంజలి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హోమ్లీ లుక్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా నటనకు ప్రాధాన్యమైన సినిమాలు తో కూడా మెప్పించింది .ఇలా టాలీవుడ్ కోలీవుడ్ లలో దాదాపు 40 సినిమాలు చేసిన అంజలి తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో తెగ సందడి చేసింది .ఈ సందర్భంగా తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు ఎవరికీ తెలియని పర్సనల్ సీక్రెట్స్ ని పంచుకుంది .ముఖ్యంగా తన స్కూల్ డేస్ లో జరిగిన ఒక క్రేజీ లవ్ ప్రపోజల్ ని మరియు రాఖీ ఎపిసోడ్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి .
also read:జాన్ అబ్రహాం ఆకలికి హోటల్ ఓనర్ షాక్.. ఒక్క సిట్టింగ్‌లో అన్ని చపాతీలు తిన్నాడా?
మామూలుగా సెలబ్రిటీల లవ్ స్టోరీ అంటేనే ఆడియన్స్ కి ఏంతో క్యూరియాసిటీ ఉంటుంది .అందులోనూ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఏకంగా రాఖీ కట్టేసానంటూ అంజలి ఓపెన్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది . అసలు ప్రపోజ్ చేసిన వ్యక్తికి రాఖీ కట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకి సమాధానంగా అంజలి నవ్వుతూ ఒక ఈగో డ్రైవ్ వల్ల అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది తన స్కూల్ చదువుకునే రోజుల్లో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక అబ్బాయి చాలా ఇష్టపడ్డాడని, రోజు తన వెనకే పడుతూ ప్రపోజ్ చేస్తూ ఉండేవాడిని గుర్తు చేసుకుంది .అయితే మొదట్లో ఆ ప్రపోజల్స్ లైట్ తీసుకున్నప్పటికీ అతడు మాత్రం వదలకుండా మూడేళ్లపాటు వెంట పడటంతో ఇక తట్టుకోలేక పదో తరగతిలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది.
ఎలాగైనా అతనిని వదిలించుకోవాలని డిసైడ్ అయి అతను ముందుకు వెళ్లి రాఖీ కడతానని చెప్పిందట.దానికి అబ్బాయి ఏమాత్రం ఆలోచన చేయకుండా ధైర్యం ఉంటే కట్టి చూడు అనడంతో రాఖీ కట్టేసిందట అంజలి.అయితే రాఖీ కడితే అన్నయ్య అనుకుని వదిలేస్తాడని భావించానని కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది అని చెప్పుకొచ్చింది .అబ్బాయి రాఖీ తీసి పక్కన పడేసి నేను నీకు నాకు అన్నయ్యని కాదు .. కన్నయ్యని అంటూ రాఖీ తీసేసి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడట.అయితే ఆ సంఘటన తర్వాత మళ్లీ అబ్బాయి తన లైఫ్ లో ఎప్పుడూ కనిపించలేదని అసలు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తన తెలియదని చెప్పుకొచ్చింది అంజలి .
ఇక అంజలి సినిమాల విషయానికి వస్తే ..ఫోటో సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు అమ్మాయి తమిళంలో కట్రదు తమిళ్ అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.ఇక తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయిన షాపింగ్ మాల్ ,జర్నీ సినిమాలు తన కెరేర్ నే మలుపు తిప్పాయి .
ముఖ్యంగా టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకి శ్రీకారం చుట్టిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా అంజలి చేసిన నటనకు మెస్మరైజ్ అయిపోయారు ఆడియన్స్ .ఇక ఆ తర్వాత గీతాంజలి అని లేడీ ఓరియంటెడ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించి మెప్పించింది.ఇక రీసెంట్ గా రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’లోనూ కనిపించి అలరించింది.మొత్తానికి స్కూల్ డేస్ లో జరిగిన ఫన్నీ క్రేజీ లవ్ స్టోరీ ఇప్పుడు ఇటు ఇందాస్త్రీ సర్కిల్స్ లో అటు అంజలి ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.