E-Paper

లెనిన్ కోసం డ్రాగన్ .. బాక్సాఫీస్ లెక్కలు మారతాయా ?

లెనిన్ కోసం డ్రాగన్ .. బాక్సాఫీస్ లెక్కలు మారతాయా ?
Advertisement

Lenin Promotions: లెనిన్.. అఖిల్ అక్కినేని సినిమా కెరియర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్  గా తెరికెక్కుతున్న యాక్షన్ డ్రామా.ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీం.ఇప్పటికే ఇందులో భాగంగా ప్రమోషన్స్ చేస్తుంది కూడా .అయితే ఇది సరిపోదన్నట్టు ఈసారి మూవీ ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్.అవును …ఈసారి ఈ  సినిమా ప్రమోషన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాని  షేక్ చేస్తుంది.అయితే కేవలం గెస్ట్ గా రావడమే కాకుండా అఖిల్ అక్కినేనిని  ఎన్టీఆర్ స్వయంగా ఇంటర్వ్యూ చేసేలా ఒక స్పెషల్ టాక్ షోని డిజైన్ చేస్తున్నారట మేకర్స్.

ఎన్టీఆర్ క్రేజ్ ఫ్యాన్ ఇండియా వైడ్

అక్కినేని, నందమూరి కుటుంబాల బాండింగ్ ఇప్పటిది కాదు.గతంలో 2019 జనవరిలో రిలీజ్ అయిన మిస్టర్ మజ్ను సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే .ఇక ఆ ఈవెంట్లో వారిద్దరి మధ్య బాండింగ్ ఫ్యాన్స్ ని  బాగా ఆకట్టుకుంది కూడా.ఇప్పుడు మళ్లీ లెనిన్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతుండటంతో ఫుల్ ఖుషి అయిపోతున్నారట నందమూరి, అక్కినేని ఫ్యాన్స్ .RRR,  దేవర వంటి సాలిడ్ సక్సెస్ సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ ఫ్యాన్ ఇండియా వైడ్ గా స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే .

సాలిడ్ బ్లాక్ బాస్టర్ కొడతానంటూ రెడీ

Advertisement

అలాంటి స్టార్ హీరో సినిమా ప్రమోషన్స్ లో భాగమైతే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.అయితే ఈ టాక్ షో పై అన్నపూర్ణ స్టూడియోస్ ,సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్  రావాల్సి ఉంది.అఖిల్ కెరీర్ ఒకసారి చూస్తే 2023లో వచ్చిన ఏజెంట్ సినిమా బొక్క బోర్లా పడటంతో ఈసారి ఏకంగా మూడేళ్ల గ్యాప్ తీసుకొని సాలిడ్ కం బ్యాక్ ఇస్తానంటూ లెనిన్  ప్రాజెక్టుని పట్టాలెక్కించాడు.2021 లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మోస్తరు హిట్ అందుకున్న అఖిల్ ఈసారి సాలిడ్ బ్లాక్ బాస్టర్ కొడతానంటూ రెడీ అయిపోయాడు.

ఈసారైనా కెరిర్లో హిట్ అందుకుంటాడో లేదో!

ఇక ఈ సినిమాకి వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.పక్కా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు గుండెకు అతుక్కునే ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు బ్యూటిఫుల్ రొమాన్స్ ఈ సినిమాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈమధ్య రిలీజ్ అయిన లెనిన్ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి అప్లాజ్  రావడం సినిమాకి మంచి బూస్టప్ అనే చెప్పాలి .ఇక వీటితోపాటు తారక్ కూడా తన సపోర్ట్ అఖిల్ కి  అందిస్తే ఓపెనింగ్స్ పరంగా లెనిన్ అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అయినా ఆశ్చర్యం లేదు .’చూడాలి మరి ఆయుధాలు అన్నీ కూడగడుతున్న అఖిల్ అక్కినేని ఈసారైనా కెరిర్లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో!

Advertisement

also read:స్కూల్ డేస్ లవ్ ప్రపోజల్.. ‘రాఖీ’తో ట్విస్ట్ ఇచ్చిన గేమ్ ఛేంజర్ బ్యూటీ!

Related News

15వ రోజు కూడా తగ్గని సమంత జోరు.. 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’?

జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌కమ్ తెలిస్తే మైండ్ బ్లాకే!

స్కూల్ డేస్ లవ్ ప్రపోజల్.. ‘రాఖీ’తో ట్విస్ట్ ఇచ్చిన గేమ్ ఛేంజర్ బ్యూటీ!

జాన్ అబ్రహాం ఆకలికి హోటల్ ఓనర్ షాక్.. ఒక్క సిట్టింగ్‌లో అన్ని చపాతీలు తిన్నాడా?

హృతిక్ నుంచి రూ. 400 కోట్ల భరణం? అసలు నిజం బయటపెట్టిన ఫరా!

ఆ బూతు బొమ్మలని తక్షణమే తొలగించండి.. టెక్ దిగ్గజాలపై కోర్టుకెక్కిన బాలీవుడ్ బ్యూటీ

దసరా రేసులో బడా హీరోలు.. ఈసారి జేబులు ఖాళీ అవ్వడం పక్కా!

Big Stories

×