Annu Controversy : అన్నూ కపూర్ …మొన్నటికి మొన్న తమన్నా కాళ్ళు పట్టుకోవడానికైన సిద్దం అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసిన ఈ వెటరన్ యాక్టర్ తాజాగా ఇండస్ట్రీ చీకటి కోణాలని మరోసారి బయట పెట్టాడు. షూటింగ్ లలో ఇంటిమేట్ సీన్స్ జరిగే సమయంలో హీరోలు కావాలనే రెచ్చిపోతారని, వాంటెడ్ గానే బార్డర్స్ క్రాస్ చేస్తారంటూ చేసిన కామెంట్స్ బీ టౌన్ లో అగ్గిని రాజేస్తున్నాయ్.
హీరోయిన్‌ను వదలకుండా వేధించాడు
ఈమధ్యే అన్నూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక స్టార్ హీరో రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినప్పటికీ కావాలనే హీరోయిన్ ని వదలకుండా హద్దులు మీరాడని తను లైవ్ లో చూసిన ఇన్సిడెంట్ ని కళ్ళకి కట్టినట్టు చెప్పుకొచ్చాడు. హీరో నుండి ఆ అమ్మాయి తప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పడిందని, సెట్ లో జరిగిన అవమానం కారణంగా రెండు రోజుల పాటు షూటింగ్ కి రాకుండా హోటల్ గదిలోనే ఉండి ఏడ్చిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు అన్నూ కపూర్. ఇక అన్నూ ఇలా స్టార్ హీరో అని అనడంతో హీరోయిన్ ని ఇబ్బంది పెట్టిన ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారా అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు నెటిజన్లు.
ALSO READ :‘కర’ రివ్యూ.. ధనుష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా?
7 ఖూన్ మాఫ్ (2011) షూటింగ్‌లో ఏం జరిగింది?
దీంతో పాటు ‘7 ఖూన్ మాఫ్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా పంచుకున్నాడు. ఆ సినిమాలో ప్రియాంక కపూర్ అన్నూ కపూర్ తో ఒక ఇంటిమేట్ సీన్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ సీన్ చేయలేనని చెప్పడం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. ఇక అదే సంఘటనని గుర్తు చేసుకుంటూ నేను అందంగా లేకపోవడం వల్లే, పైగా ముసలి వాడిని అవడంతోనే ప్రియాంక చోప్రా ఆ సీన్ చేయలేదని, అదే నా స్థానంలో ఎవరైనా పెద్ద హీరో ఉండి ఉంటే ప్రియాంక సీన్ చేయకుండా ఉండేది కాదని ఇండస్ట్రీలో హీరోయిన్స్ బిహేవియర్ పై తనదైన శైలిలో సెన్సేషన్ కామెంట్స్ చేశాడు అన్నూ. ఇక విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఫిబ్రవరి 18, 2011న విడుదలైన ఈ ‘7 ఖూన్ మాఫ్’ కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కల్ట్ స్టేటస్ పొందడం విశేషం.
అయితే ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు తను మాత్రం ఆడవాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని క్లారిటీ ఇచ్చాడు. కానీ కొందరు హీరోలు మాత్రం తమ కోరికలని తీర్చుకోవడానికి ఇలాంటి సీన్స్ వాడుకుంటారని, ఈ బిహేవియర్ వల్లే ఇండస్ట్రీలోని ఆడవాళ్ళు మెంటల్ గా డిప్రెషన్ కి వెళ్లిపోతారని మనసులోని మాటల్ని బయటపెట్టాడు ఈ వెర్సటైల్ యాక్టర్.
అన్నూ కపూర్ విషయానికి వస్తే ..
ఫిబ్రవరి 20, 1956న మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో జన్మించిన అన్నూ కపూర్ అసలు పేరు అనిల్ కపూర్. అయితే తను వచ్చేనాటికే అనిల్ కపూర్ బాలీవుడ్ లో ఉండటంతో పేరు కలవకుండా అన్నూ కపూర్ గా మారిపోయాడు. ఇక 1983లో శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ‘మండి’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అన్నూ మిస్టర్ ఇండియా (1987), తేజాబ్ (1988), ఉత్సవ్ (1984) సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన దర్శకత్వంలో 1994లో వచ్చిన ‘అభయ్’ సినిమాకి ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు రావడం విశేషం.
ఏది ఏమైనా రొమాంటిక్ సీన్స్ ని స్టార్ హీరోలు తమ కోరికలు తీర్చుకోవడానికి వాడుకుంటారు అంటూ అన్నూ చేసిన కామెంట్స్ బాలీవుడ్ హీరోల గుండెల్లో వణుకు పుట్టిస్తుందనే చెప్పాలి.