E-Paper
Advertisement

స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్ కల్తీ పాల కోటపై అధికారుల పంజా..!

స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్ కల్తీ పాల కోటపై అధికారుల పంజా..!
Advertisement

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ పాల దందాపై ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలు జిల్లా యంత్రాంగాన్ని కదిలించాయి. “హుజూరాబాద్‌లో వైట్ పాయిజన్” శీర్షికతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలపై ఆహార భద్రతా శాఖ అధికారులు బుధవారం తక్షణమే స్పందించారు. పట్టణంలోని పలు డైరీ ఫాంలు, విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించి కలకలం రేపారు.

రంగంలోకి ఆహార భద్రత అధికారులు

పశువుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వందల లీటర్ల పాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయనే కోణంలో పత్రిక ప్రచురించిన కథనం జిల్లా అధికారుల దృష్టికి వెళ్ళింది. జిల్లా ఆహార భద్రతా అధికారి (FSO) వి. అంకిత్ రెడ్డి నేతృత్వంలో, శాంపిల్ అసిస్టెంట్ ప్రేమ్ సాగర్ బృందం పట్టణంలోని సైదాపూర్ రోడ్డు, కరీంనగర్ బైపాస్ రోడ్డు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సైదాపూర్ రోడ్డులోని ఒక ప్రైవేట్ డైరీలో నిల్వ ఉంచిన పెరుగు నాణ్యతను చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అది పెరుగులా కాకుండా కృత్రిమంగా తయారైన పదార్థంలా ఉండటంతో వెంటనే నమూనాలను సేకరించారు.

ల్యాబ్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు..

Advertisement

కరీంనగర్ బైపాస్ రోడ్డులోని సింగపూర్ – ఎరుకల గూడెం మధ్య గల డైరీ ఫాంను సైతం అధికారులు తనిఖీ చేసి పాలు, పాల పదార్థాల నమూనాలను సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపించినట్లు అంకిత్ రెడ్డి తెలిపారు. “ల్యాబ్ నివేదికలో కల్తీ జరిగినట్లు తేలితే సదరు నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే సహించేది లేదు” అని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Also Read: భారీ ఎండల నుంచి ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!

లైసెన్స్ లేని డైరీలకు నోటీసులు..

Advertisement

తనిఖీల సమయంలో పలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డైరీ కేంద్రాలు కనీస FSSAI (భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ) లైసెన్స్ లేకుండానే ఏళ్ల తరబడి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిర్వాహకులకు అక్కడికక్కడే నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా లైసెన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని, లేనిపక్షంలో డైరీలను శాశ్వతంగా మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

‘స్వేచ్ఛ’ పత్రికపై ప్రజల ప్రశంసలు

ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ ముఠా సాగిస్తున్న అక్రమాలను సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చిన ‘స్వేచ్ఛ’ పత్రికపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్రికా కథనం వల్లే అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి తనిఖీలు చేశారని, ఇకనైనా కల్తీ మాఫియాకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీలతో అక్రమ వ్యాపారుల్లో వణుకు మొదలైంది.

Also Read: PSLలో మ‌రో దారుణం…స్టేడియంలో ఆఫ్ క‌రెంట్…ఒక్క‌సారిగా లైట్స్ ఆఫ్ !

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×