E-Paper
Advertisement

Anupama -Dhruv Vikram: విరోష్ బాటలోనే అనుపమ ధ్రువ్ విక్రమ్..ఫోటోలతో హింట్ ఇస్తున్నారుగా?

Anupama -Dhruv Vikram: విరోష్ బాటలోనే అనుపమ ధ్రువ్ విక్రమ్..ఫోటోలతో హింట్ ఇస్తున్నారుగా?
Advertisement

Anupama -Dhruv Vikram: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తుకు సంపాదించుకున్న వారిలో నటి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఒకరు. ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక గత ఏడాది ఏకంగా ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ దాదాపు మూడు సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక గత ఏడాది ఈమె నటించిన సినిమాలలో బైసన్ సినిమా ఒకటి. క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో ఈమె ధృవ్ విక్రమ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.

రిలేషన్ లో అనుపమ ధృవ్ విక్రమ్..

ఈ సినిమా అనంతరం సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల అనుపమ ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)పోస్ట్ కు రియాక్ట్ అవుతూ హార్ట్ ఎమోజి షేర్ చేయడంతో వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అయితే వీరు తమ రిలేషన్ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల వీరు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.

విరోష్ బాటలోనే అనుపమ ధృవ్..

Advertisement

ఈ వీడియో చూస్తుంటే వీరిద్దరూ కలిసి వెకేషన్ వెళ్లారని స్పష్టమవుతుంది. వీరిద్దరి వీడియోలలో ఒకటే బ్యాక్ గ్రౌండ్ కనిపించడంతో వీరిద్దరూ జంటగా  వెళ్లారని స్పష్టం అవుతుంది. కానీ వీళ్లు మాత్రం తమ రిలేషన్ బయట పెట్టకుండా ఇలా ఫోటోలు వీడియోల రూపంలో హింట్ ఇస్తున్న నేపథ్యంలో అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అనుపమ, ధృవ్ విక్రమ్ తమ రిలేషన్ విషయంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మికను (Rashmika) ఫాలో అవుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ రష్మిక గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారు కానీ వీరి రిలేషన్ మాత్రం బయట పెట్టలేదు అయితే ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ జంటగా వెళుతూ ఓకే బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

రూమర్లపై మౌనంగా ఉన్న అనుపమ..

Advertisement

ఇలా విజయ్ రష్మిక ఫోటోల ద్వారా తమ రిలేషన్ బయటపెట్టారు .ఇప్పుడు వీరి బాటలోనే అనుపమ, ధృవ్ విక్రమ్ కూడా రిలేషన్ లో ఉంటూ ఫోటోలు ద్వారా హింట్ ఇస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఈ వార్తలు వస్తున్నప్పటికీ అనుపమ, ధృవ్ విక్రమ్ ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. ఇలా వీరిద్దరూ ఈ రూమర్లపై మౌనంగా ఉండడంతో వీరి రిలేషన్ రూమర్లకు మరింత బలం చేకూరుతుందని చెప్పాలి. మరి వీరి రిలేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తల పట్ల స్పష్టత రావాలి అంటే ఈ జంట స్పందించాల్సి ఉంది.

Also Read: Allu Arjun: అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్.. బన్నీ డ్రెస్,వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా?

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×