టాటా మోటార్స్ ఫిబ్రవరి 2026 అమ్మకాల్లో అద్భుతంగా రాణించింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మొత్తం అమ్మకాలు 63,331 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ్య 2025 ఫిబ్రవరిలో అమ్ముడైన 46,811 యూనిట్లతో పోలిస్తే, 35 శాతం పెరుగుదలను కనబరుస్తున్నాయి.
దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో టాటా మోటార్స్ 62,329 యూనిట్లు అమ్మింది. గత ఏడాది ఫిబ్రవరిలో నమోదైన 46,435 యూనిట్ల నుండి 34 శాతం వృద్ధిని సాధించింది. అంతర్జాతీయ అమ్మకాల్లో 167 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 376 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది 1,002 యూనిట్లకు చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి 2026లో 8,385 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఫిబ్రవరి 2025లో అమ్ముడైన 5,343 EVల కంటే 57 శాతం వృద్ధిని చూపిస్తుంది.
ఫిబ్రవరి 2026లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా నెక్సాన్ అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఈ మోడల్ ఈ నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా కూడా ఘనత వహించింది. టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు కార్లలో ఒకటిగా నిలిచింది. ఫిబ్రవరి 2026లో రెండవ అత్యధికంగా అమ్ముడైన SUV కూడా ఇదే కావడం విశేషం. ఈ సబ్ 4m SUV ఇటీవల ఫేస్ లిఫ్ట్ తో అప్ డేట్ చేయబడింది. ఈ కారు అప్ డేటెడ్ వెర్షన్ లో పలు రకాల కాస్మెటిక్ మార్పులు, సరికొత్త ఫీచర్లతో అప్ డేట్ అయ్యింది.
Read Also: మహీంద్రా XEV 9e సినీలక్స్ బుకింగ్స్ ప్రారంభం, డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?
టాటా మోటార్స్ ఫిబ్రవరి అమ్మకాల పనితీరు దాని ప్యాసింజర్ వెహికల్ పోర్ట్ ఫోలియోలో స్థిరమైన వృద్ధిని సూచిస్తుంది. ఈ వృద్ధిలో కంపెనీకి చెందిన SUV, EV డిమాండ్ రెండూ మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండు విభాగాల్లో అమ్మకాలు పెరగడంతో కంపెనీ గత ఏడాదిలో పోల్చితే ఏకండా 35 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Read Also: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!