Paramapada Sopaanam:అర్జున్ అంబటి…’అర్ధనారి’,’తెప్ప సముద్రం’ లాంటి డిఫరెంట్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ది’లో కీలక పాత్ర పోషిస్తూనే, మరోవైపు హీరోగా ‘పరమపద సోపానం’ అనే ఇంటెన్స్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వస్తుండటం విశేషం. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు కలిసి ఈ సినిమాని నిర్మించగా పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించారు.
పూరి స్కూల్ నుంచి వస్తున్న దర్శకుడు
ఇక ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయ్. ముఖ్యంగా పూరి స్కూల్ నుంచి వస్తున్న దర్శకుడు కావడంతో, సినిమాలో డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే చాలా షార్ప్‌గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
also read:హోంబలే ఫిల్మ్స్‌కు రిషబ్ శెట్టి షాక్? ‘కాంతార 3’ ఆగిపోతుందా.. అసలు గొడవ అదేనా
‘ఈగల్’సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన డేవ్ జాండ్ ..
ఇక మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఈగల్’లాంటి హై బడ్జెట్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన డేవ్ జాండ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా ,ఇప్పటికే విడుదలైన ‘చిన్ని చిన్ని తప్పులేవో’, ‘భూమ్ భూమ్’ సాంగ్స్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి కూడా .ఇక టీజర్ చూస్తుంటే ఇది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఒక బలమైన కథ ఉన్న సినిమా అని అర్థమవుతోంది. ఇక ఈశ్వర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి రిచ్ నెస్ తెచ్చిందనే చెప్పాలి.
ఏప్రిల్ 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి
ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా.ఇందులో అర్జున్ అంబటి లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉండటమే కాకుండా, సినిమా కథపై క్యూరియాసిటీ పెంచుతోంది.
మెగా సినిమా ‘పెద్ది’లో కీ రోల్
మొత్తానికి బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రతి ఇంట్లో ప్యామిలీ మెంబర్ లా మారిపోయిన అర్జున్, ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నట్టె కనిపిస్తుంది.ఇక మెగా సినిమా ‘పెద్ది’లో కనిపిస్తున్న టైమ్‌లోనే అర్జున్ హీరోగా ఈ సినిమా వస్తుండటం అతనికి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈనెల 24న వస్తున్న ఈ ‘పరమపద సోపానం’ బాక్సాఫీస్ వద్ద అర్జున్ రేంజ్‌ను ఎంతవరకు పెంచుతుందో!
also read:బాక్సాఫీస్ సునామీ..‘బాహుబలి’, ‘పుష్ప’ రికార్డులు అవుట్.. సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్!