E-Paper
Advertisement

ఇన్నేళ్ల కెరియర్లో అక్కడ ఉండలేకపోయా.. మానసికంగా కృంగిపోయా – అవికా గోర్!

ఇన్నేళ్ల కెరియర్లో అక్కడ ఉండలేకపోయా.. మానసికంగా కృంగిపోయా – అవికా గోర్!
Advertisement

Avika Gor: తెలుగువారి గుండెల్లో చిన్నారి పెళ్లికూతురుగా చెరగని ముద్ర వేసుకున్న అవికా గోర్, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన కొత్త సినిమా ‘అగ్లీ స్టోరీ’ సెట్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఆమె ఓపెన్ అయ్యారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యానని, ఆ పాత్ర ప్రభావంతో మానసికంగా కృంగిపోయానని అవికా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..

‘అగ్లీ స్టోరీ’ కోసం అవికా కష్టం:

నందు మరియు అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ఈ సినిమా మే 22న గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగం గా జరిగిన ప్రెస్ మీట్‌లో అవికా తన మనసులోని మాటను పంచుకున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన మరియు ఇబ్బందికరమైన పాత్ర ఇదేనని ఆమె స్పష్టం చేశారు. ఆ పాత్రలో ఉన్న నెగెటివ్ షేడ్స్ తనను షూటింగ్ జరిగినంత కాలం వెంటాడాయని తెలిపారు.

ఇది మామూలు ప్రేమకథ కాదు:

Advertisement

మనం నిత్యం చూసే సినిమాల్లో ప్రేమకథలు చాలా అందంగా, ఆదర్శంగా ఉంటాయి. కానీ ‘అగ్లీ స్టోరీ’ పేరుకు తగ్గట్టే సంబంధాల్లోని చీకటి కోణాలను చూపిస్తుందట. రిలేషన్‌షిప్‌లో ఉండే టాక్సిక్ ధోరణులు, మనుషులను ఎలా దెబ్బతీస్తాయనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని అవికా వివరించారు. ఇక ఈ కథలోని డార్క్ షేడ్స్ చూసి తను సెట్‌లో ఉండలేకపోయేదాన్నని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేక్షకులకు నిజం చెప్పాలి:

ప్రేక్షకులను మోసం చేయడం తమ ఉద్దేశ్యం కాదని, అందుకే ఈ సినిమా గురించి ముందే నిజం చెబుతున్నామని అవికా అన్నారు. ఇది ఒక స్వీట్ లవ్ స్టోరీ అని కలరింగ్ ఇవ్వకుండా, సమాజంలో ఉన్న చేదు నిజాలను చూపించే ప్రయత్నం చేశామని ఆమె నిజాన్ని ముందే చెప్పేసారు. ఇక భావోద్వేగాల పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందని, ముఖ్యంగా నేటి తరం బంధాల మధ్య ఉన్న గొడవలను, మానసిక ఒత్తిడిని థ్రిల్లింగ్‌గా చూపిస్తుందని చెప్పారు.

ఆ పాత్ర మానసికంగా కుంగదీసింది:

Advertisement

సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా నటించడానికి అవికా చాలా ఇబ్బంది పడ్డారట. ఒక వ్యక్తి మానసిక స్థితిని, ప్రవర్తనను మార్చేసే స్థాయిలో ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయని ఆమె తెలిపారు. షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్ర తాలుకూ ఎమోషన్స్ నుంచి బయటకు రావడానికి తనకు చాలా సమయం పట్టిందని, అప్పుడప్పుడు సెట్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు.

ALSO READ:అతడితో జాన్వీకపూర్ పెళ్లి.. స్పందించిన బోనీ కపూర్!

మే 22న విడుదల:

ఇక నందు – అవికా మధ్య వచ్చే సీన్లు చాలా రియలిస్టిక్‌గా మరియు థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రణీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ ‘అగ్లీ స్టోరీ’ని తెరకెక్కించినట్లు మూవీ టీమ్ తెలిపింది.

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×