Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాలు జనాల్లో మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి.. ప్రస్తుతం ఆయనకు సోషల్ మీడియాలోనూ ఇటు మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇటీవల వరసగా సినిమాలలో నటించారు.. గతంలో ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలు అన్నిటిని పూర్తి చేశారు.. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోగా… కొన్ని మాత్రం యావరేజ్ టాక్ ని అందుకున్నాయి.. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నాడు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి ఆయన ఓ రెండు ప్రాజెక్టులు చేయాల్సి ఉంది.. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఇకమీదట సినిమాలు చేస్తాడా..? చెయ్యడా? అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ చూసి చాలామంది కొత్త సినిమా కోసమేమో అని అనుకున్నారు.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.. టాలీవుడ్ ఇన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఓ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కి వినిపించాడట.. అందులో కొన్ని మార్పులు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఆ కథకి అసంతృప్తి చెందడంతో మళ్లీ కథను సిద్ధం చేసే పనిలో సురేందర్ రెడ్డి ఉన్నారట.. ప్రస్తుతం ఆ స్క్రిప్టు పూర్తవడానికి కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం కూడా ఉంది.. దాంతో సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తున్నాడన్నా వార్తలకు చెక్ పడింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించాడు.. ముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. అంతే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది అంటూ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకు కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.. అయితే ఈ కథని పూర్తి చేయాలంటే కచ్చితంగా జనవరి వరకు టైం పట్టేలా కనిపిస్తుంది.. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి , ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ ఈ పుష్కరాల బాధ్యతని దగ్గర ఉండి చూసుకుంటున్నారు. దాంతో ఇప్పటిలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు. మరి వచ్చేఏడాది కొత్త సినిమాలు చేస్తారని టాక్. మరి ఈ ఏడాదిలో ఇక పవన్ కళ్యాణ్ సినిమా లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది బాడ్ న్యూస్ అని చెప్పాలి..