E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ రివ్యూ..

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ రివ్యూ..
Advertisement

Peddi Review: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాను వీక్షించిన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ప్రేక్షకులు సినిమాపై, రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరారు. నిన్న రాత్రి ప్రత్యేకంగా ‘పెద్ది’ సినిమాను చూసిన బన్నీ.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా తన సోదరుడు రామ్ చరణ్ నటనను చూసి గర్వపడుతున్నట్లు ఎమోషనల్ అయ్యారు.

Read also-‘పెద్ది’ వివాదంపై సోనా మోహపాత్ర సంచలన వ్యాఖ్యలు..

రామ్ చరణ్ ‘మైండ్ బ్లోయింగ్’ పర్ఫార్మెన్స్

Advertisement

సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. “నిన్న రాత్రి ‘పెద్ది’ సినిమా చూశాను. నా ప్రియమైన రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. ఆ పాత్రలో ఎంతో రఫ్ అండ్ రా (raw) గా కనిపిస్తూనే, అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో, అలాగే గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో మెప్పించాడు. ప్రతి విషయంలోనూ చరణ్ పర్ఫెక్ట్‌గా అలరించాడు. నా సోదరుడిని చూసి నేను నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. అతనికి దక్కుతున్న ప్రతి చప్పట్లకు, ప్రశంసలకు అతను ఖచ్చితంగా వంద శాతం అర్హుడు” అంటూ చరణ్ మేకోవర్‌ను, యాక్టింగ్‌ను బన్నీ కొనియాడారు.

సినిమాలో ఇతర నటీనటుల ప్రదర్శన గురించి ప్రస్తావిస్తూ.. “జగపతి బాబు గారు, అలాగే మిగిలిన నటీనటులు కూడా స్క్రీన్‌పై అద్భుతమైన నటనను కనబరిచారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌కు నా బెస్ట్ విషెస్. సినిమా సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు నా అభినందనలు” అని బన్నీ రాసుకొచ్చారు.

Advertisement

Read also-Illu Illalu Pillalu Today Episodes: పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్.. నర్మదా ప్లాన్ తో శ్రీవల్లికి షాక్..

బుచ్చిబాబుకు హాట్సాఫ్

డైరెక్టర్ బుచ్చిబాబు సన స్క్రీన్ ప్లే, టేకింగ్‌ను అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. “ఇక ఈ ఓడకు కెప్టెన్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు సన కి నా ప్రత్యేక అభినందనలు. సినిమాలో ప్రతి ఒక్కరినీ ఎలివేట్ చేస్తూ.. చరణ్ గారిని ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టినందుకు ధన్యవాదాలు. ‘పెద్ది’ చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ బన్నీ తన పోస్ట్‌ను ముగించారు.

రామ్ చరణ్‌ను తన ‘బ్రదర్’ అని సంబోధిస్తూ అల్లు అర్జున్ చేసిన ఈ రివ్యూ ట్వీట్.. ఇరు హీరోల అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది. మెగా అండ్ అల్లు ఫ్యామిలీస్ మధ్య ఉన్న బాండింగ్‌ను ఈ ట్వీట్ మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇచ్చిన ఈ పాజిటివ్ రివ్యూతో ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వేట మరింత జోరందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Related News

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

18 మంది వేద పండితులతో డైరెక్టర్ గోపీచంద్ ధన్వంతరి హోమం!

పూరీ జగన్నాథ్ దారుణంగా మోసపోయాడు.. నిజాలు బయటపెట్టిన రఘు కుంచె!

పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పవిత్ర!

మెగా ఫ్యాన్స్ కి షాక్.. రామ్ చరణ్ కు సర్జరీ..?

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!

పదహారేళ్లకే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. అప్పుడే షూటింగ్ పూర్తి!

Big Stories

Advertisement
×