Akhanda 2 : బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2. ఈపాటికి థియేటర్స్ లో సంచలనం సృష్టించవలసిన ఈ సినిమా చివరి నిమిషంలో ఆర్థిక లావాదేవీలు కారణంగా పోస్ట్ పోన్ అయిపోయింది. కాసేపట్లో ప్రీమియర్లు మొదలవుతాయి అనుకునే టైంలో చాలామంది అభిమానులతో పాటు ప్రేక్షకులకు పోకిరి లెవెల్ ట్విస్ట్ వచ్చింది. గతంలో ఉన్న ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయని సందర్భంగా ఈ సినిమాను వాయిదా వేసినట్లు తేలింది.
అయితే ప్రీమియర్ షోలు మాత్రమే క్యాన్సిల్ అయిపోయాయి. మరుసటి రోజు మామూలుగా షో పడిపోతుంది అని చాలామంది ఊహించారు. కానీ ఒక్కరోజులో అవేవీ కొలిక్కి రాలేదు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల పరిస్థితులు అన్నీ కూడా చక్కబడ్డాయి. లోకల్ ఫైనాన్షియర్స్ కు కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసేశారు. ఈ తరుణంలో సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పెద్ద సినిమాలకు ఈ మధ్యకాలంలో ముందు రోజు ప్రీమియర్లు పడటం అనేది జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా కూడా డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్ షోలు మొదలుకానున్నాయి. సినిమా రిలీజ్ అవడం లేట్ ఏమో కానీ ఖచ్చితంగా ఒక సంచలనం క్రియేట్ చేయడం మాత్రం పక్కా అనే నమ్మకంతో చాలామంది ఉన్నారు. గతంలో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి.
All set for the Divine Destruction at the box office 🔥
Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱
BOOKINGS OPEN SOON!#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/LVmTNIObEr— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా విపరీతంగా ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమాల్లో కమర్షియల్ రంగులతో పాటు ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో కూడా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమయిపోతుంది.
ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలకు తమన్ ఏ రేంజ్ లో సంగీతం అందిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మామూలు సీన్ కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా చేయడం తమన్ మ్యూజిక్ కి ఉన్న స్ట్రెంత్.
Also Read: Varanasi: వారణాసి అప్డేట్ ఇచ్చిన దేవ కట్టా, రాజమౌళి చూస్తే పరిస్థితి ఏంటి గురు?