E-Paper
Advertisement

Akhanda 2: అఖండ నిర్మాతలకు బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్… ట్రెండింగ్ లో అఖండ 2 రిలీజ్!

Akhanda 2: అఖండ నిర్మాతలకు బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్… ట్రెండింగ్ లో అఖండ 2 రిలీజ్!
Advertisement

Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన అఖండ2(Akhanda 2) సినిమా విడుదల విషయంలో అభిమానులు గందరగోళంలో ఉన్నారు ఈ సినిమా విడుదలవుతుంది అంటూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు కాని చివరి నిమిషంలో ఈ సినిమా ఫైనాన్స్ ఇబ్బందులు కారణంగా వాయిదా పడిన నేపథ్యంలో అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల గురించి నిత్యం ఏదో ఒక వార్త బయటకు వస్తుంది కానీ ఇప్పటివరకు అధికారకంగా చిత్ర బృందం ఎక్కడ విడుదల తేదీ గురించి ప్రకటన ఇవ్వలేదు దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాతలకు వార్నింగులు…

ఇలా అఖండ 2 సినిమా విడుదల గురించి స్పష్టత రాని నేపథ్యంలో బాలకృష్ణ అభిమానులు నిర్మాణ సంస్థకు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా “# WeWantAkhanda2OnDec12th” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ కచ్చితంగా విడుదల చేయాలి అంటూ ఈ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా నిర్మాతలను కూడా హెచ్చరిస్తున్నారు.. ఇలా సినిమా విడుదల విషయంలో త్వరలోనే సరైన స్పష్టత ఇవ్వని నేపథ్యంలో బాలయ్య అభిమానుల నుంచి నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి.

సందిగ్ధంలో అఖండ 2 విడుదల?

Advertisement

ఇక ఈ సినిమా ఫైనాన్స్ విషయంలో నిర్మాతలు సుమారు 50 కోట్లకు పైగా ఇరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ వారికి చెల్లించాల్సి ఉందని ఈ డబ్బులు చెల్లించే వరకు సినిమా విడుదలకు అనుమతి లేదని తెలపడంతో సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది
ఇప్పటికే చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం రాలేదని తెలుస్తోంది. మరి అఖండ 2 విడుదల విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

డిసెంబర్ 12న విడుదల?

Advertisement

ఆఖండ2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ విడుదల చేయొచ్చు అని వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి కానీ స్పష్టత లేదు ఒకవేళ డిసెంబర్ 12వ తేదీ విడుదల కానీ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇలా అఖండ సినిమా ఈ రెండు తేదీలలో విడుదల అయితే ఎన్నో సినిమాలు తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. 12వ తేదీ అలాగే 25వ తేదీ భారీ స్థాయిలో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఆఖండ2 విడుదల అయితే చిన్న సినిమాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. మరి ఆఖండ2 వివాదానికి ఎప్పుడు తెర పడుతుందనేది తెలియాల్సింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×