E-Paper
Advertisement

Delhi Politics: ‘వందేమాతరం’పై పార్లమెంటులో రచ్చ.. 10 గంటలు దీనిపైనే చర్చ, 1937లో ఏం జరిగింది?

Delhi Politics: ‘వందేమాతరం’పై పార్లమెంటులో రచ్చ.. 10 గంటలు దీనిపైనే చర్చ, 1937లో ఏం జరిగింది?
Advertisement

Delhi Politics: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గేయంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. అందుకు 10 గంటలు సమయం కేటాయించారు. ఈ క్రమంలో సభా సమావేశాలు సజావుగా సాగుతాయా? లేకుంటే విమర్శలు-ప్రతి విమర్శలు చోటు చేసుకుంటాయా? అనేదానిపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు జోరందుకున్నాయి.

వందేమాతరం గేయంపై చర్చ

Advertisement

వందేమాతరం గేయం 150 ఏళ్లు కానున్న నేపథ్యంలో సోమవారం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ దీనికి సంబంధించి చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్‌ ప్రసంగించనున్నారు. ఈ చర్చ కోసం 10 గంటల సమయాన్ని కేటాయించారు. కాంగ్రెస్‌ తరపున లోక్‌సభలో పార్టీ ఉపనేత గౌరవ్‌ గొగొయ్, ప్రియాంకాగాంధీలు మాట్లాడనున్నారు. అటు రాజ్యసభలో దీనిపై చర్చను హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం ప్రారంభించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రసంగిస్తారు.

Advertisement

దేశ భక్తి గీతానికి సంబంధించిన తెలిసిన అంశాలను పార్లమెంటు ఉభయసభలు హైలైట్ చేయనున్నాయి. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం 1875 నవంబరు 7న లిటరరీ జర్నల్‌ బంగదర్శన్‌లో తొలిసారి ప్రచురితమైంది. 1882లో ఆనందమఠ్‌ నవలలో బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని భాగం చేశారు. వందేమాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాన్ని జరుపుకుంటోంది. 

వివాదాలకు తావు లేకుండా జరిగేనా?

1937లో ఫైజాబాద్‌లో జరిగిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ గీతం నుంచి కీలక చరణాలను కొందరు నేతలు తొలగించిందని వాదన లేకపోలేదు. దీనివల్ల దేశ విభజనకు బీజాలు నాటిందన్నది బీజేపీ కీలక నేతల మాట.  ఈ నిర్ణయం రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు తీసుకున్నారన్నది కాంగ్రెస్ వాదుల మాట.

ఇతర వర్గాలు, సభ్యుల భావాలను స్వీకరించడమేనని కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తెలిపింది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రధాన జాతీయ నాయకులతో కూడిన వర్కింగ్ కమిటీ ఈ చర్యను సిఫార్సు చేసిందని అంటున్నారు. మొదటి రెండు చరణాలు ఇప్పటికే ఎక్కువగా పాడబడుతున్నారని ఈ కమిటీ గుర్తించింది. 1896 కాంగ్రెస్ సమావేశంలో ఆయన స్వయంగా వందేమాతరం పాడారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ALSO READ: ఇండిగో సంక్షోభం.. ఎమ్మెల్యేలు తిప్పలు, రోడ్డు మార్గంలో కొందరు

సభలో చర్చ సందర్భంగా ఆనాటి వివాదాస్పద అంశాలపై అధికార పార్టీ తెరపైకి తేవచ్చని భావిస్తున్నాయి విపక్షాలు. వీటిని తిప్పికొట్టేందుకు అనుభవమైన నేతలు మాట్లాడాలని భావిస్తున్నారు. ఒకవేళ పాలకపక్షం నుంచి ఎదురుదాడి మొదలైతే దాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయోనని సామాన్యుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×