Balakrishna Injury: కాకినాడ పోర్ట్ ఏరియాలో జరుగుతున్న ఆయన కొత్త సినిమా ‘NBK 111’ షూటింగ్ స్పాట్‌లో ఊహించని ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఫైట్ సీన్‌లో బాలయ్య డూప్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేస్తుండగా, ఊహించని విధంగా కాలు జారి మోకాలికి బలంగా దెబ్బ తగిలడం తో యూనిట్ సభ్యులు ఆయనను వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కూడా.ఇక ఫస్ట్ ఎయిడ్ చేసి, మోకాలికి అవసరమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు డాక్టర్స్.ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.
కళ్యాణ్ రామ్ ఎమోషనల్ ట్వీట్
ఇక ఇదిలా ఉండగా బాలయ్యకు ప్రమాదం జరిగిందనే వార్త తెలియగానే నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.త్వరగా కోలుకో బాబాయ్.. మీరు త్వరలోనే మళ్లీ కోలుకుని మీకు అత్యంత ఇష్టమైన షూటింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నాను(“Get well soon Babai. Wishing you a speedy recovery. I’m sure you will be back in action in no time, doing what you love the most”)అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.
Get well soon Babai. ❤️
Wishing you a speedy recovery. I'm sure you will be back in action in no time, doing what you love the most.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) July 21, 2026
మాస్ కాంబో.. తగ్గేదే లే!
వయసు ఎంత ఉన్నా సరే, రిస్కీ స్టంట్స్ దగ్గర డూప్‌ని వాడకుండా రియల్‌గా చేయడం బాలయ్యకి ఉన్న అలవాటే. గతంలో గోపీచంద్ మలినేనితో చేసిన ‘వీరసింహారెడ్డి’ ఊరమాస్ హిట్ అవ్వడంతో, మళ్లీ రిపీట్ అవుతున్న ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతీ సీన్‌ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే బోయపాటి శ్రీనుతో ‘అఖండ’, అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’, బాబీ కాంబోలో వచ్చిన ‘డాకు మహారాజ్’ వంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ దగ్గర జోరు మీదున్నారు బాలయ్య. ఇలాంటి టైమ్‌లో ఈ కొత్త సినిమా కోసం ఫుల్ ఎనర్జీతో పనిచేస్తుంటే, ఈ చిన్న యాక్సిడెంట్ వల్ల షూటింగ్‌కి కాస్త బ్రేక్ పడింది.
బాలకృష్ణ కాకినాడ ఆస్పత్రిలోనే ఉన్నారనే న్యూస్ బయటకు రాగానే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకుని, మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి మాస్ రచ్చ చేయాలని కోరుకుంటున్నారు. డాక్టర్ల సలహా ప్రకారం ఆయన కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్నాకే మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ట్వీట్ చేసిన గోపీచంద్ మలినేని
ఇక బాలయ్యకి గాయం కావడం పట్ల డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేస్తూ కాకినాడ లో ‘NBK111’ సినిమా షూటింగ్‌లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా, నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మజిల్ టియర్ (కండరాల గాయం) అయిందని ,త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని, మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు ఒక చిన్న మైనర్ సర్జరీ చేయించుకోనున్నారని చెప్పుకొచ్చాడు.
#NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది.
వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది.
సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని…
— Gopichandh Malineni (@megopichand) July 21, 2026