Toxic Song: కేజీఎఫ్.. ఈ సిరీస్ చాలు యష్ రేంజ్ ఏంటో చెప్పడానికి. 100 కోట్లే కష్టమనుకున్న శాండల్ వుడ్ కి ఏకంగా వెయ్యి కోట్లని పరిచయం చేశాడు ఈ రాకింగ్ స్టార్. అలాంటి హీరో చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా “టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్”.ఇక ఆగస్టు 8న సినిమా ట్రైలర్ రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్. అందులో భాగంగా ఇప్పటికే సినిమా నుండి వదిలిన అనౌన్స్‌మెంట్ టీజర్ అటు అంచనాలని,ఇటు కాంట్రవర్సీలని కలిపి మోసుకురాగా,ఈమధ్యే వదిలిన ‘తబాహీ’ సోషల్ మీడియా లో ఎలా మంటలు పెట్టాయో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా కియారా అద్వానీతో యశ్ వేసిన స్టెప్పులకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ని కురిపించారు మూవీ లవర్స్.
తారా సుతారియా తో కూడా అదే రేంజ్ కెమిస్ట్రీ
ఇక ఇదే క్రమంలో మూవీ నుండి మరో సాలిడ్ అప్ డేట్ వదిలింది మూవీ యూనిట్.అందులో భాగంగా రెండో పాట ‘మనసు ఆగదే’అంటూ ఈసారి కాస్త మెలోడి టచ్ తో పాటని వదిలారు.అయితే మొదటి పాటలో కియారా తో రొమాన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో పండించిన యష్ ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా తో కూడా అదే రేంజ్ లో కెమిస్ట్రీ ని పండించడం విశేషం.
ముఖ్యంగా బాత్‌టబ్‌లో తారా గ్రాండ్ ఎంట్రీ సీన్, యశ్ తనదైన గ్యాంగ్‌స్టర్ కట్ మార్క్‌తో ఏకంగా ఒక గన్‌తో ఆమె వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే సీన్ ఆడియన్స్ కి పిచ్చెక్కించడం పక్కా.ఇక ఈ పాటలో వర్షంలో ఇద్దరూ కలిసి చేసే రొమాంటిక్ మూమెంట్స్, కేఫ్‌లో వచ్చే కిస్సింగ్ సీన్లు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి.ఇక పాట ఇలా వచ్చిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో అప్పుడే రికార్డు వ్యూస్‌తో దూసుకుపోవడం విశేషం.
ఏ రేంజ్‌లో ఉండబోతోందో
ఇక పాట విషయానికి వస్తే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో స్టైలిష్‌గా వస్తుందని అప్ డేట్స్ చూస్తేనే అర్థం అవుతున్నాయి.ఇక ఈ పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో తారా సుతారియాతో పాటు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి క్రేజీ స్టార్ కాస్టింగ్ నటిస్తుండటం సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది.
also read :“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ మిశ్రా, కనిష్క్ బాగ్చీ సంగీతం అందించారు. ఈ రెండో పాటతో ‘టాక్సిక్’ మేనియా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో ఉండబోతుందో క్లియర్‌గా అర్థమవుతోంది.. ఇక గ్రాండ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ మాత్రం ఆగస్టు 26న ఉండబోతోందని సమాచారం. సెకండ్ సింగిల్‌తో మొదలుపెట్టి ట్రైలర్ వరకు రాబోయే రోజుల్లో ‘టాక్సిక్’ హవా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఉండబోతోందో వేచి చూడాలి.