E-Paper
Advertisement

‘కార్పెంటర్’ గా బాలయ్య మెప్పిస్తాడా? లేక ‘ఆచార్య’ లాగే ముంచేస్తాడా?

‘కార్పెంటర్’ గా బాలయ్య మెప్పిస్తాడా? లేక ‘ఆచార్య’ లాగే ముంచేస్తాడా?
Advertisement

Balayya Carpenter : అఖండ2 తర్వాత జోరు పెంచాడు బాలయ్య.ముఖ్యంగా అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’అంటూ హ్యాట్రిక్ కొట్టడంతో బాలయ్య స్పీడ్ కి హద్దే లేకుండా పోయింది.ఈక్రమంలో ‘వీరసింహారెడ్డి’లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో NBK111 మొదలెట్టాడు కూడా. అయితే .లైనప్ లో కురుక్షేత్ర అంటూ వివేక్ ఆత్రేయ, మాంచి పోలీస్ సబ్జెక్ట్ అంటూ విజయ్ కనకమేడల, మరో మాంచి మాస్ ఎంటర్ టైనర్ చేస్తానంటూ హనీఫ్ అదేని..ఇలా డైరెక్టర్స్ అంతా క్యూలో ఉంటె ఈ సినిమా తర్వాత ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో అంటూ క్యూరియస్ గా వాచ్ చేశారంతా.కానీ అనూహ్యంగా బాలయ్య ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎగరేసుకుపోయాడు కొరటాల.ఇక ఈ సినిమా ఓపెనింగ్ మే 21న జరగబోతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది.

also read :విజయ్-త్రిష మెహందీ వేడుకలో నేను డ్యాన్స్ చేస్తా: బాలీవుడ్ క్వీన్ ఓపెన్ ఆఫర్!

Advertisement

ఇక వీటి సంగతి ఇలా ఉంటె లేటెస్ట్ గా ఈ సినిమా గురించి నెట్టింట వైరల్ అవుతున్న ఒక న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టేస్తుంది. అదే ఈ సినిమాకి ‘కార్పెంటర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న వార్తలు రావడం.వినడానికి వింతగా ఉన్నా, ఈ టైటిల్ వెనుక ఉన్న లింక్ చూస్తుంటే ఎదో కొడుతుంది సీనా అంటూ అప్పుడే నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలెట్టారట యాంటి ఫ్యాస్స్.

‘ఆచార్య’ రిపీట్ కాబోతుందా?

Advertisement

ఈ సినిమా టైటిల్ ‘కార్పెంటర్’ అని ప్రచారం జరగడానికి ప్రధాన కారణం.. ఇందులో బాలయ్య పాత్ర కార్పెంటర్‌గా ఉంటుందట. అయితే ఇక్కడే మొదలైంది అసలు భయం.గతంలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ట్రోలర్స్ కి ఏ రేంజ్ లో స్టఫ్ ఇచ్చిందో అంట ఈజీగా మర్చిపోలేము. ఆ సినిమాలో కూడా చిరు కూడా కాసేపు కార్పెంటర్ గా దర్శనమిస్తాడు.ఇక కారణాలేవైనా తెలుగు సినీ హిస్టరీలోనే పెద్ద అట్టర్ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కొరటాల శివ, అదే కార్పెంటర్ బ్యాక్‌డ్రాప్‌ను బాలయ్య కోసం ఎంచుకోవడం తెగ వైరల్ అవుతుంది.

నెగెటివ్ సెంటిమెంట్.. వర్కవుట్ అవుతుందా?

సాధారణంగా బాలయ్య సినిమాలకు ‘సింహా’, ‘నరసింహా’ వంటి పవర్‌ఫుల్ టైటిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్.అలాంటిది ‘కార్పెంటర్’ అనే సాఫ్ట్ టైటిల్ మాస్ ఆడియన్స్‌కు ఎంతవరకు ఎక్కుతుందో కొరటాల వారికే తెలియాలి. అయితే కార్పెంటర్ అనే టైటిల్‌కు యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్.

also read :వరల్డ్ కప్ స్టేజ్ పై నోరా పెర్ఫార్మెన్స్..ఫిఫా వేడుకల్లో అరుదైన రికార్డు!

కానీ ఎటొచ్చి ఆ ‘ఆచార్య’ మిగిల్చిన బ్యాడ్ మెమరీస్ నే మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక కొరటాల తన ప్రతీ సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఎలిమెంట్ యాడ్ చేస్తుంటారు. మరి ఈ ‘కార్పెంటర్’ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తాడో చూడాలి. ఏది ఏమైనా చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకి మే 21న జరగబోయే ఓపెనింగ్ ఈవెంట్ అయినా సమాధానం ఇస్తుందో లేదో చూడాలి !

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×