E-Paper
Advertisement

ఉదయం లేవగానే మెరిసిపోయే చర్మం కావాలా.. రాత్రి తప్పనిసరిగా ఈ పనులు చేయండి

ఉదయం లేవగానే మెరిసిపోయే చర్మం కావాలా.. రాత్రి తప్పనిసరిగా ఈ పనులు చేయండి
Advertisement

ఆరోగ్యకరమైన, మెరుగైన చర్మం కోసం ప్రతిరోజు రాత్రి సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నిద్రపోతున్నప్పుడు చర్మం సహజంగానే రిపేర్ చేసుకుంటుంది. రాత్రి స్కిన్‌కేర్ రొటీన్ పాటిస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, నూనె, కాలుష్యాన్ని తొలగించి చర్మాన్ని మృదువుగా, తేమగా, తాజాగా ఉంచుతుంది. ఎంత అలసటగా ఉన్నా.. రాత్రి పడుకునే ముందు సరైన చర్మ సంరక్షణ తప్పనిసరిగా పాటించాల్సిందే.

నిద్రపోయే ముందు మేకప్ తొలగించండి

మేకప్‌తో నిద్రపోవడం చర్మానికి చాలా హానికరం. ఇది రంధ్రాలను మూసి, మురికిని లోపల బంధిస్తుంది. దీని వల్ల మొటిమలు, ముఖం నిస్తేజంగా ఉంటుంది. ముఖం అందంగా లేకపోతే చికాకుగా అనిపిస్తుంది. సున్నితమైన మేకప్ రిమూవర్ లేదా క్లెన్సింగ్ బామ్‌తో మేకప్ పూర్తిగా తొలగించండి.

ముఖాన్ని బాగా శుభ్రం చేయండి

Advertisement

ముఖంపై ఉండే చెమట, దుమ్ము, నూనె, కాలుష్యాన్ని క్లెన్సర్‌తో తొలగించాలి. మీ చర్మం రకానికి తగిన సున్నితమైన క్లెన్సర్ ఉపయోగించి వృత్తాకారంగా మసాజ్ చేసి, సాధారణ లేదా వెచ్చని నీటితో కడగాలి. హార్ష్‌గా ఉండే సబ్బులు వాడకండి.

టోనర్ ఉపయోగించి చర్మాన్ని తాజాగా చేయండి

క్లెన్సింగ్ తర్వాత టోనర్ చర్మాన్ని రిఫ్రెష్ చేసి, తేమ సమతుల్యం చేస్తుంది. రోజ్ వాటర్ సహజమైన టోనర్‌గా ఉపయోగపడుతుంది. కాటన్ ప్యాడ్ లేదా చేతులతో అప్లై చేస్తే మంచి ప్రయోజనాలుంటాయి.

సీరంతో అదనపు పోషణ

Advertisement

సీరం చర్మ సమస్యలను పరిష్కరించడానికి బాగా పని చేస్తుంది. ‘విటమిన్ సి’ సీరం చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. హైల్యూరోనిక్ యాసిడ్ సీరం.. రాత్రంతా తేమ అందిస్తుంది. కొన్ని చుక్కలు వేసి
మెల్లగా మసాజ్ చేయండి.

నిద్రపోయే ముందు మాయిశ్చరైజర్ తప్పనిసరి

మాయిశ్చరైజర్ చర్మాన్ని పొడిబారకుండా రక్షించి, తేమను లాక్ చేస్తుంది. ఆయిలీ స్కిన్‌కు లైట్ మాయిశ్చరైజర్, డ్రై స్కిన్‌కు రిచ్ క్రీమ్ వాడాలి. ముఖం, మెడకు మసాజ్ చేసి పూయండి.

పెదవుల సంరక్షణ మరచిపోకండి

పెదవులు కూడా రాత్రి సంరక్షణ అవసరం. పొడి పెదవులు గట్టిపడి, చీలిపోతాయి. లిప్ బామ్, నెయ్యి లేదా కొబ్బరి నూనె పూయండి.

కళ్ల కింద చర్మం కోసం స్పెషల్ క్రీమ్

కళ్ల చుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. అలసట వల్ల కళ్ల కింద చర్మం పేలవంగా ఉంటుంది. అక్కడ ‘ఐ క్రీమ్’ పూస్తే.. తేమ వల్ల డార్క్ సర్కిల్స్, పఫినెస్ తగ్గిస్తుంది. మెల్లగా ట్యాప్ చేసి పూయాలి.

రోజంతా తగినంత నీళ్లు తాగండి

శరీరం లోపలి నుంచి హైడ్రేషన్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ ఎక్కువ నీళ్లు తాగడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

రాత్రి మంచి నిద్ర అవసరం

7-8 గంటల మంచి నిద్ర చర్మం రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. శుభ్రమైన పిల్లో కవర్ వాడండి.

Also Read: రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారా.. నిద్ర రావడం లేదా? దానికి కారణాలు ఇవే

ఎక్కువ ఉత్పత్తులు వాడకండి

చర్మం రకానికి తగిన ఉత్పత్తులు మాత్రమే వాడండి. సరళమైన రొటీన్ ఎక్కువ మంచిది.

ఈ టిప్స్ నిరంతరం పాటిస్తే సహజమైన గ్లో

రాత్రి స్కిన్‌కేర్ రొటీన్ క్రమం తప్పకుండా చేస్తే చర్మం సహజంగా మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×