Balayya Makeover : బాలయ్య తర్వాత సినిమా ఎవరితో ఉండబోతుంది అన్న ప్రశ్నకి ఎండ్ కార్డ్ పడుతూ ఎట్టకేలకి కొరటాల శివతో సినిమా ఫిక్స్ అయిపోయిందన్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ సినిమాలో బాలయ్య మేకోవర్ గురించి కొన్ని రోజులుగా డిస్కషన్స్ జోరుగా నడుస్తున్నాయ్.ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ ప్రత్యేకమైన మేకోవర్ ప్లాన్ చేస్తున్నారంటూ ఊదరగొట్టేస్తుంది సోషల్ మీడియా.
వర్కౌట్ కాని మేకోవర్లు
వాస్తవంగా చూస్తే…బాలకృష్ణకు వింటేజ్ మాస్ లుక్స్, సాంప్రదాయ గెటప్‌లు సెట్ అయినంతగా సోకాల్డ్ ‘అల్ట్రా స్టైలిష్’ మేకోవర్లు గతంలో పెద్దగా వర్కవుట్ అవ్వలేదన్న సంగతి తెల్సిందే. కొందరు దర్శకులు బాలయ్యను స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం చేసి బొక్క బోర్లాపడ్డారు.వీరభద్ర, ఒక్క మగాడు, మిత్రుడు,శ్రీమన్నారాయణ ,పరమవీర చక్ర వంటి సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొరటాల కూడా అదే రూట్ ఎంచుకుంటే అది కాస్తా వికటించే ప్రమాదం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.కేవలం లుక్ మార్చినంత మాత్రాన సరిపోదని, బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా సీన్లు పడకపోతే థియేటర్లలో ఫ్యాన్స్ తలలు పట్టుకోవడం ఖాయమన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్.
also read :లోకేశ్‌తోనే మొదలుపెడదాం…చంద్రబాబు ‘పాపులేషన్’ కామెంట్స్‌పై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్
దేవర’ కమర్షియల్ గా హిట్ అయినా ..
‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుండి వచ్చిన ‘దేవర’ కమర్షియల్ గా మంచి వసూల్లే చూసినప్పటికీ కొరటాల పాత మార్కు స్క్రీన్ ప్లే మ్యాజిక్ మిస్ అయిందన్న టాక్ వినబడింది.మరి సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని కలిసి భారీ బడ్జెట్ పెడుతున్న ఈ సినిమాలో బాలయ్య లాంటి హెవీ మాస్ ఇమేజ్ ఉన్న హీరోను కొరటాల ఎలా హ్యాండిల్ చేస్తాడోనని డౌట్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
తిరుగులేని ఫామ్‌లో ఉన్న బాలయ్య
నిజానికి బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడనే చెప్పాలి. ‘అఖండ’ సినిమాతో మొదలైన ఆయన జైత్రయాత్ర, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకులు బాలయ్యను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశారు. కానీ కొరటాల శివ స్టైల్ వేరు. ఆయన సినిమాల్లో యాక్షన్ కంటే క్లాస్ ఎమోషన్స్, లెక్చర్లు ఇచ్చే క్యారెక్టరైజేషన్లు ఎక్కువగా ఉంటాయి. మాస్ ఆడియన్స్‌ను ఊపేసేలా ఊరమాస్ డైలాగులు చెప్పే బాలయ్యకు, సోషల్ మెసేజ్‌ల చుట్టూ కథలు అల్లే కొరటాల శివకు అస్సలు సింక్ కుదురుతుందా అన్నది సినిమా అప్ డేట్స్ వదిలితే కాని తెలీదు.ఇక సినిమా విషయానికి వస్తే ఈ ఆగస్టు నెలలోనే సినిమా పట్టాలెక్కుతుందని, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలవుతుందని ఇన్ సైడ్ టాక్. చూడాలి కొరటాల వారి మీదున్న మరకని ఈ సినిమాతో ఎలా చెరిపేసుకుంటాడో !
also read :పెద్ది ట్రైలర్ రివ్యూ.. రామ్ చరణ్ ‘బీస్ట్ మోడ్’.. బుచ్చిబాబు ప్యూర్ మాస్ జాతర!