E-Paper
Advertisement

పుచ్చకాయ జ్యూస్‌‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు.. గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?

పుచ్చకాయ జ్యూస్‌‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు.. గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?
Advertisement

Watermelon juice for heart health: పుచ్చకాయను చాలా మంది “కేవలం నీళ్లు, షుగర్ ఉండే పండు” అని లైట్ తీసుకుంటారు. కానీ.. అమెరికాకు చెందిన సైన్స్ డైలీ, లూసియానా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో ఓ షాకింగ్ నిజం వెల్లడైంది. రోజువారీ డైట్‌లో పుచ్చకాయ లేదా పుచ్చకాయ జ్యూస్‌ను భాగం చేసుకోవడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ అద్భుతంగా మెరుగుపడుతుందని, హై బీపీ కంట్రోల్‌లోకి వస్తుందని కనుగొన్నారు. ఈ ఎర్రటి పండు మన గుండెను.. రక్తనాళాలను లోపల నుంచి ఎలా కాపాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది ఏంటి?

Advertisement

లూసియానా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కొంత మంది ఆరోగ్యవంతమైన యువకులపై రెండు వారాల పాటు ఒక క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. వారికి రోజూ పుచ్చకాయ జ్యూస్ ఇచ్చి పరిశీలించగా.. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా రక్తనాళాలు కుంచించుకుపోకుండా.. వాటి పని తీరు దెబ్బతినకుండా ఈ జ్యూస్ రక్షించిందని తేలింది. తేకాదు.. రెగ్యులర్‌గా పుచ్చకాయ తినే వారి శరీరంలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటున్నాయని.. వారు జంక్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్‌కు దూరంగా ఉంటూ మెరుగైన లైఫ్‌స్టైల్ లీడ్ చేస్తున్నారని సర్వేల్లో తేలింది.

గుండెను కాపాడే ఆ ‘మ్యాజికల్ కాంపోనెంట్స్’ ఇవే..

Advertisement

1. ఎల్‌-సిట్రులిన్ -రక్తనాళాల రిలాక్సేషన్:
పుచ్చకాయలో ‘ఎల్‌-సిట్రులిన్’ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. మనం ఈ జ్యూస్ తాగినప్పుడు బాడీ దీనిని ‘ఎల్‌-అర్జినైన్’గా మార్చి, ఆ తర్వాత ‘నైట్రిక్ ఆక్సైడ్’గా మారుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన రక్తనాళాలను వెడల్పుగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుతుంది. దీని వల్ల రక్తం ఎలాంటి అడ్డంకులు లేకుండా గుండెకు సరఫరా అవుతుంది. అంతే కాకుండా బ్లడ్ ప్రెజర్ సహజంగానే తగ్గుతుంది.

2. లైకోపీన్ -పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్:
పుచ్చకాయకు ఆ ఎరుపు రంగు రావడానికి కారణం అందులో ఉండే ‘లైకోపీన్’. ఇది శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ (కణాల డ్యామేజ్)ను తగ్గిస్తుంది. లాంగ్ టర్మ్‌లో గుండె జబ్బులు రాకుండా చేయడంలో లైకోపీన్ కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: షుగర్, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు నేరేడు పండ్లు తినొచ్చా? మెడికల్ రీసెర్చ్ ఏం చెబుతోందంటే?

పుచ్చకాయ జ్యూస్‌తో ఇతర  ప్రయోజనాలు:
ఇన్‌స్టంట్ హైడ్రేషన్: పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఎండల్లో లేదా వర్కవుట్ చేసిన తర్వాత ఒక గ్లాస్ పుచ్చకాయ జ్యూస్ తాగితే బాడీ ఇన్‌స్టంట్‌గా రీఛార్జ్ అవుతుంది.

లో-క్యాలరీ స్నాక్: రెండు కప్పుల పుచ్చకాయ ముక్కల్లో కేవలం 80 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మినరల్స్ నిధి: ఇందులో విటమిన్ సి, బి6 లతో పాటు గుండెకు అత్యంత అవసరమైన పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా లభిస్తాయి.

ఇకపై పుచ్చకాయను కేవలం ఒక సమ్మర్ టైమ్‌పాస్ ఫ్రూట్‌లా చూడకండి. ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉండే కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌లను పక్కన పెట్టి.. హ్యాపీగా ఇంట్లోనే నేచురల్ పుచ్చకాయ జ్యూస్ చేసుకొని తాగండి. ఇది మీ దాహాన్ని తీర్చడమే కాదు, మీ గుండెను కూడా పదిలంగా ఉంచుతుంది. సో, హెల్తీగా ఉండండి, స్మార్ట్‌గా ప్లాన్ చేసుకోండి.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×