E-Paper
Advertisement

Nandamuri Balakrishna : హీరోలు అసలు సెట్స్ కు రారు, మరోసారి నోరు జారిన బాలయ్య

Nandamuri Balakrishna : హీరోలు అసలు సెట్స్ కు రారు, మరోసారి నోరు జారిన బాలయ్య

Nandamuri Balakrishna : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ టాప్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇప్పుడు అంతా కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఎవరూ చేయని ప్రయోగాత్మక చిత్రాలు కూడా బాలకృష్ణ చేసేవాళ్లు. అతని కెరియర్ లో ఆరోజుల్లోనే భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి సినిమాలు ఉన్నాయి అంటే అతనికి సినిమాల మీద ఉన్న ముందుచూపు అని చెప్పొచ్చు.

బాలకృష్ణ కెరియర్ లో క్లాసిక్ సినిమాలు ఎలా ఉన్నాయో డిజాస్టర్ సినిమాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు కథను చెప్పిన తర్వాత దాన్ని నమ్మితే ఏం చేయమన్నా చేసేస్తారు. అలా చేసే సందర్భాల్లోనే తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, మీసం మెలేస్తే బాంబులు పేలటం వంటివి జరిగాయి. అయితే అవి అప్పట్లో కమర్షియల్ గా కూడా కొంతమేరకు వర్కౌట్ అయ్యాయి. అలానే ఇప్పుడు అవి ట్రోల్ మెటీరియల్ అయిపోయాయి.

హీరోలు సెట్స్ కు రారు 

నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది కాబట్టి ఏ చిన్న తప్పిదం చేసినా కూడా క్షణాల్లో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం మొదలవుతుంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు విపరీతమైన ట్రోలింగ్ కి గురి అయ్యాయి.

స్టేజ్ పైన మాట్లాడిన మాటలు వలన పలు రకాల కామెంట్స్ కూడా బాలకృష్ణ మీద వచ్చాయి. అయితే రీసెంట్గా బాలకృష్ణ అఖండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ కొంతమంది హీరోలు అసలు సెట్స్ కు రారు. గ్రీన్ మ్యాట్ లోను, బ్లూ మ్యాట్ లోను షూటింగ్ చేసేస్తుంటారు. కానీ నేను ఒరిజినల్ అంటూ బాలకృష్ణ చెప్పుకున్నారు.

అన్ స్టాపబుల్ చేంజ్ 

ఒక తరుణంలో బాలకృష్ణ సినిమా అంటే ఎవరికీ ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. ఏ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి కూడా నడిచింది. ఆహా లో వచ్చిన అన్ స్టాపబుల్ అనే షో తర్వాత బాలకృష్ణ మీద విపరీతమైన పాజిటివిటీ పెరిగింది.

అతను చాలామంది యంగ్ హీరోస్ తో మాట్లాడే విధానం, సీనియర్ హీరోస్ ని కూడా డీల్ చేసే విధానం ఇవన్నీ కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అక్కడితో బాలకృష్ణ అంటే చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది.

ఆ షో తర్వాత విడుదలైన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం వల్లనే ఇప్పుడు వస్తున్న అఖండ 2 సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వీటన్నిటిని మించి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండటం సహజంగానే జరుగుతుంది.

Also Read: Amrutham : ఒరేయ్ తెగ ఆయాస పడిపోకు చాలు , 90 స్ కిడ్స్ కి అసలైన గుడ్ న్యూస్

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×