E-Paper
Advertisement

Ram Pothineni: టాప్ ప్రొడక్షన్ హౌస్ లో రామ్ పోతినేని, దర్శకుడు అతడైతేనే సినిమా చేస్తా అంటూ కండిషన్స్

Ram Pothineni: టాప్ ప్రొడక్షన్ హౌస్ లో రామ్ పోతినేని, దర్శకుడు అతడైతేనే సినిమా చేస్తా అంటూ కండిషన్స్
Advertisement

Ram Pothineni: షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన రామ్ పోతినేని దేవదాస్ సినిమాతో హీరోగా మారిపోయాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఆ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాతోనే కొరియోగ్రాఫర్ గా రాకేష్ మాస్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది. వాళ్ళ సందర్భాలలో దేవదాస్ సినిమా గురించి రాకేష్ మాస్టర్ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా మాట్లాడారు.

ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నాడు రామ్ పోతినేని. వరుసగా డిజాస్టర్ సినిమాలు రామ్ కెరియర్ లో వస్తున్న కూడా తనకు ఉన్న ఫ్యాన్ బేస్ వలన కొత్త సినిమా రిలీజ్ అయితే మంచి ఓపెనింగ్స్ రావడమనేది సహజంగా జరుగుతుంది. అయితే ఒక సినిమా సక్సెస్ టాక్ వచ్చేస్తే ఆటోమేటిక్ గా ఆడియన్స్ దానిని ఆదరిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలుక అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.

ఆ ప్రొడక్షన్ హౌస్ లో రామ్ పోతినేని 

Advertisement

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివకు కూడా మంచి కం బ్యాక్ అయింది.

అయితే ఆ బ్యానర్ నిర్మాత సుధాకర్ తో రామ్ కలిశారు. అయితే వారిద్దరి మధ్య ఒక సినిమా గురించి ఆసక్తికర డిస్కషన్ జరిగింది. అయితే రామ్ మాత్రం దర్శకుడు కొరటాల శివ అయితే మాత్రమే సినిమాలు చేస్తాను అని నిర్మాత సుధాకర్ కి చెప్పారట.

Advertisement

దీనిని బట్టి సుధాకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కొరటాల శివ మరోవైపు దేవర పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం డ్రాగన్ సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడు అని వార్తలు వస్తున్నాయి.

కొరటాల మరో ప్రాజెక్టు చేస్తాడా?

త్రివిక్రమ్ తో సినిమా అంటే టైం ఎక్కువగానే పడుతుంది అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత అరవింద సమేత సినిమాని తొందరగా పూర్తి చేసి సక్సెస్ అందుకున్నాడు. కానీ మామూలుగా త్రివిక్రమ్ సినిమాకి సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటారు.

డ్రాగన్ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తే టైం ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి దేవర 2 చేయడానికి ఇంకా టైం ఉంటుంది. ఈ లోపు కొరటాల శివ రామ్ పోతినేని హీరోగా సినిమా చేస్తారా అని చాలామందికి వస్తున్న సందేహం. దీని గురించి అధికారిక ప్రకటన వస్తేగానీ ఒక క్లారిటీ రాదు.

Also Read: Bigg Boss 9: స్నేహితుడి కోసం బిగ్ బాస్ హౌస్ కి మెగా హీరో

Related News

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

Big Stories

Advertisement
×