E-Paper
Advertisement

Paya Paya Video Song: ఈశ్వరా పవనేశ్వరా.. అంటూ స్టెప్పులు వేసిన బండ్ల గణేష్..!

Paya Paya Video Song: ఈశ్వరా పవనేశ్వరా.. అంటూ స్టెప్పులు వేసిన బండ్ల గణేష్..!
Advertisement

Paya Paya Video Song: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని ఎప్పుడూ ఓపెన్‌గా చూపించే బండ్ల గణేశ్, గతంలో ఓ వేదికపై..ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో భారీగా వైరల్ అయ్యాయి. ఆ డైలాగ్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు అదే డైలాగ్‌ను, అదే పవన్ కళ్యాణ్ మేనరిజంతో బండ్ల గణేశ్ మరోసారి రీమిక్స్ చేసి అభిమానులను అలరించారు. ఆయన నటించిన తాజా ఓటీటీ సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని లోని పాయా పాయా పాటలో ఈ సీన్ కనిపిస్తుంది. ఈ సినిమా ఈటీవీ విన్ లో త్వరలో.. స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా పాయా పాయా పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని ఫుడ్ ఫెస్టివల్ సన్నివేశంలో వస్తుంది. పాట అంతా సరదాగా, ఉత్సాహంగా సాగుతుంది. ఇందులో బండ్ల గణేశ్ చెప్పే ఫేమస్ డైలాగ్‌ను కొత్తగా రీమిక్స్ చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సీన్ చూసిన పవన్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Advertisement

ఈ పాటలో ప్రముఖ కమెడియన్ అలీ డీజే ఆపరేటర్ పాత్రలో కనిపించారు. అలీ కామెడీ టైమింగ్ పాటకు మరింత కలర్ తీసుకొచ్చింది. బండ్ల గణేశ్ పవన్ స్టైల్ మేనరిజాలు, అలీ కామెడీ కలిసి ఈ పాటను ప్రత్యేకంగా నిలిపాయి.

ఈ సినిమాలో శివాజీ.. లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ సరదా వినోదంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 12 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక పాయా పాయా.. పాటలో బండ్ల గణేశ్ చేసిన ఈ ఫన్ యాక్ట్..పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ALSO READ: Chandrahas: అనుపమ పరమేశ్వరన్‌ను రిజెక్ట్ చేసిన ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×