Bandla Ganesh:ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను అభిమానులతో పంచుకునే ఈయన అప్పుడప్పుడు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఇటీవల తన కూతురి నిశ్చితార్ధాన్ని ఘనంగా నిర్వహించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈరోజు త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూనే.. పరోక్షంగా మీరు కన్న కలలు నిజమవ్వాలి అంటూ విజయ్ ఎలక్షన్స్ రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. నేడు త్రిష 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది త్రిష. ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఇక అక్కడి నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా అలాగే సామాన్య ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె మాట్లాడుకుండా కేవలం చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది. అక్కడ ఒక అభిమాని మేడం ఈసారి విజయం మనదే అంటూ కామెంట్ చేయగా అప్పుడు ఆమె బిగ్గరగా నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోయిన వీడియోలు అటు జాతీయ మీడియాలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ తన ఇన్ ట్విట్టర్ ఖాతా ద్వారా “త్రిష కృష్ణన్ కంగ్రాట్యులేషన్స్.. మీరు కన్న కలలన్నీ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాకారం కావాలి” అంటూ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ కంగ్రాట్స్ చెప్పడంతో పలు రకాల కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ రాజకీయంగా గెలుపొందాలని ఆమె కలలు కంది. ఆ కలలను నేడు స్వామి వారు నిజం చేయాలని బండ్లన్న ట్వీట్ చేసినట్లు ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో త్రిష రిలేషన్ లో ఉందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రిష ఈ విషయాలపై ఎప్పటికప్పుడు ఇండైరెక్టుగా స్పందించినా.. ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్లడం, కలసి పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు హాజరవడంతో నిజంగానే ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు త్రిష ఇటీవల ఏప్రిల్ 23న తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ సమయంలో ఓటు వేసి..అటు పంచుకున్న వీడియోలలో ఈమె ఉన్న కారులో క్రైస్తవ గుర్తు కనిపించింది . వాస్తవానికి త్రిష పక్కా హిందూ . అలాంటిది ఈమె కారులో క్రైస్తవ సింబల్ కనిపించేసరికి విజయ్ కోసమే మతం మార్చుకుంది అనే కామెంట్లు వినిపించాయి .విజయ్ క్రైస్తవ మతస్థుడు అన్న విషయం అందరికీ తెలిసిందే.
also read:నిరాశలో సాయి పల్లవి.. ఆందోళనలో ఫ్యాన్స్!
దీనికి తోడు విజయ్ భార్య సంగీత కూడా ఒక సినీనటి వల్లే తాను తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నాను అంటూ కూడా కామెంట్లు చేసింది. పైగా కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇలాంటి సమయంలో త్రిష ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నప్పటికీ.. ఇదే రోజు తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో త్రిష విజయ్ కోసమే ప్రార్థించడానికి తిరుపతి వెళ్ళింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ చేసిన పోస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది.
@trishtrashers congratulations your dreams, come true with blessings of Lord Venkateswara .💐
— BANDLA GANESH. (@ganeshbandla) May 4, 2026