E-Paper
Advertisement

నిరాశలో సాయి పల్లవి.. ఆందోళనలో ఫ్యాన్స్!

నిరాశలో సాయి పల్లవి.. ఆందోళనలో ఫ్యాన్స్!
Advertisement

Sai Pallavi:నటిగానే కాదు నాట్య మయూరిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి పల్లవి.. అద్భుతమైన కథల ఎంపికతో లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటిది ఈమె తొలిసారి బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మాణంలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ వచ్చిన చిత్రం ‘ఏక్ దిన్’. హిందీలో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఒక రోజు’ అంటూ విడుదల చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.

సాయి పల్లవిని భారీగా నిరాశపరిచిన ఏక్ దిన్..

వాస్తవానికి సాయి పల్లవి హిందీలో అరంగేట్రం చేస్తోంది అనే వార్తలు వచ్చినప్పటి నుంచే.. ఆమె డెబ్యూ మూవీ కోసం అటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు మూవీ అనడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా మొదటి రోజు 1.37కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించిన ఈ సినిమా.. రెండవ రోజు వద్దే ఆగిపోయింది. ఇక రెండు రోజుల్లో కలుపుకుంటే కేవలం రూ.2.15 కోట్ల నెట్, రూ.2.57 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది ఈ సినిమా. పైగా అటు ఓవర్సీస్ లో కూడా నిరాశే మిగిలింది. విదేశాలలో కేవలం రూ.25 లక్షల వసూలు మాత్రమే రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ2.82 కోట్ల గ్రాస్ కే పరిమితమయ్యాయి.

Advertisement

also read:బన్నీ మూవీ కోసం అనిరుధ్ భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!

మొదటి సినిమాని డిజాస్టర్.. రామాయణం సంగతేంటి?

అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేకపోయింది. థాయ్ మూవీ వన్ డే కి అధికారిక రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కథపరంగా చూసుకుంటే జపాన్ నేపథ్యంలోనే ఒక సున్నితమైన ప్రేమ కథగా రూపొందించారు. కథలో బలం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సాయి పల్లవి తన నటనతో మెప్పించినప్పటికీ..జునైద్ అనుభవలేమి ఇక్కడ స్పష్టంగా కనిపించింది అనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో గుర్తుండిపోయే ట్విస్టులు లేకపోవడమే కాదు బలమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు.. మొత్తానికి అయితే సాయి పల్లవి బాలీవుడ్లో కోటి ఆశలతో అడుగుపెట్టింది. మొదటి సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూసింది. కానీ ఈ సినిమా నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఈమె హిందీ రామాయణం సినిమాలో నటిస్తోంది. ఇందులో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవికి కనీసం ఈ సినిమానైనా మంచి విజయాన్ని అందివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×