E-Paper
Advertisement

హడావుడి లేదు…ప్రేమ మాత్రమే ఉంది…బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్

హడావుడి లేదు…ప్రేమ మాత్రమే ఉంది…బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్
Advertisement

Bellam Konda Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈయన తన ప్రియురాలు కావ్య రెడ్డితో కలిసి ఏడడుగులు నడవ బోతున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో ఎంతో ఘనంగా జరగబోతోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 5వ తేదీ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల నిశ్చితార్థపు వేడుక హైదరాబాదులో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాశ్వత బంధానికి ఆరంభం..

ఇలా ఎంగేజ్మెంట్ అనంతరం సాయి శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా తన నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.”ఈ క్షణం నుంచి అంతా మారిపోతుంది.. నిండు మనసుతో ఒకరి కళ్ళల్లో ఒకరు మాత్రమే కనిపిస్తూ, మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన శాశ్వతమైన బంధంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఎలాంటి హడావిడి లేదు.. తొందర లేదు.. కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమ కూడా మా సొంతమైన స్వచ్ఛమైన ప్రేమ.. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు, ఒక శాశ్వత బంధానికి ఆరంభం” అంటూ ఈయన తన ప్రేమ గురించి తన కాబోయే భార్య కావ్య రెడ్డి గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

పసుపు దంచే వేడుక ప్రారంభం..

Advertisement

ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న నేపథ్యంలోనే సాయి శ్రీనివాస్ వారి ప్రేమ గురించి భావోద్వేగా పోస్ట్ చేస్తూ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఏప్రిల్ 5వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట పెళ్లి వేడుకలను కూడా ప్రారంభించారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్లో పసుపు దంచే వేడుక కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పసుపు దంచే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కావ్య రెడ్డి సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు ఈమె తండ్రి లాయర్ కాగా తాత జడ్జిగా పనిచేశారని తెలుస్తుంది. ఇలా ఉన్నత కుటుంబానికి చెందిన కావ్య రెడ్డి బెల్లంకొండ ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు. ఇక కావ్య ఏం చదువుకుంది ఆమె ఏం చేస్తారు అని విషయాలు తెలియాల్సి ఉంది. ఇక వీరి వివాహం ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో ఘనంగా జరగబోతోంది.

Also Read: స్టెరాయిడ్స్ వద్దు… బుల్లితెర హీరో విశ్వకు సలహా ఇచ్చిన రామ్ చరణ్… ఏం జరిగిందంటే?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×