E-Paper
Advertisement

Bellamkonda srinivas wedding: బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కావ్య పెళ్లి పిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Bellamkonda srinivas wedding: బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కావ్య పెళ్లి పిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Bellamkonda srinivas wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో హీరోలందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లోనే రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అలాగే మరొక టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) కూడా పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మార్చి 8వ తేదీ సాయి శ్రీనివాస కావ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరు కావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కావ్య రెడ్డితో సాయి శ్రీనివాస్ పరిణయం..

ఇలా సాయి శ్రీనివాస్ కావ్యల నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ గా మారడంతో సాయి శ్రీనివాస్ తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ అది నిశ్చితార్థం కాదని, ఇరువురు కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి నిశ్చయం చేసుకున్నారని తెలిపారు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్తను తెలియజేస్తాము అంటూ సాయి శ్రీనివాస్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి(Kavya Reddy)పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏప్రిల్ 29న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం..

Advertisement

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యల నిశ్చితార్థం ఏప్రిల్ 5వ తేదీ హైదరాబాదులో కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తుంది. అదే విధంగా ఏప్రిల్ 29వ తేదీ వీరి వివాహం తిరుమల తిరుపతిలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా జరగబోతుందని తెలుస్తోంది. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్న ఈ జంట మే 1వ తేదీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలకు చాలా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇలా వీరిద్దరూ సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్న విషయం పట్ల నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

తిరుపతిలో శ్రీనివాస్ కావ్యల వివాహం..

Advertisement

ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు డెస్టినేషన్ పేరుతో ఇతర దేశాలలో వెళ్లి ఘనంగా పెళ్లిలో జరుపుకుంటున్నారు కానీ సాయి శ్రీనివాస్ కావ్య మాత్రం చాలా సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకోబోతున్నడంతో వీరి నిర్ణయం పట్ల అభిమానులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక కావ్య రెడ్డి అనే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదని పారిశ్రామికవేత్త కుమార్తె అని తెలుస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఈ తేదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వీరి పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే సాయి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ ఇంట విషాదం.. వాటిని బ్యాన్ చేయండంటూ పీఎంకు రిక్వెస్ట్!

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×