E-Paper
Advertisement

Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ ఇంట విషాదం.. వాటిని బ్యాన్ చేయండంటూ పీఎంకు రిక్వెస్ట్!

Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ ఇంట విషాదం.. వాటిని బ్యాన్ చేయండంటూ పీఎంకు రిక్వెస్ట్!
Advertisement

Rahul Ramakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ఒకరు. భరత్ అనే నేను, గీత గోవిందం, జాతి రత్నాలు వంటి సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో ప్రధాన నటుడిగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా రాహుల్ రామకృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు .అదేవిధంగా తన తమ్ముడి మరణానికి కారణం పారాక్వాట్(Paraquat) అనే పురుగుమందు కారణమని తెలిపారు.

మరణించిన రాహుల్ రామకృష్ణ సోదరుడు..

పారాక్వాట్ అనే గడ్డి మందు రసాయనం కారణంగా తన సోదరుడు మరణించారని, ఈ రసాయనాన్ని బ్యాన్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడాలి అంటూ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పిఎం నరేంద్ర మోడీని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా విరివిగా లభిస్తుంది. ఈ రసాయనం కారణంగా మరణాల సంఖ్య కూడా అధికమవుతుందని రాహుల్ రామకృష్ణ తెలిపారు. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు ఈ హానికర రసాయనాన్ని  కొనుగోలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈయన తెలిపారు.

పారాక్వాట్ రసాయనాన్ని నిషేధించండి..

Advertisement

ఇలాంటి హానికరమైన రసాయనాన్ని వీలైనంత త్వరగా బ్యాన్ చేయాలని కోరుతూ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నరేంద్ర మోడీని కూడా రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇలా పురుగు మందు కారణంగానే తన సోదరుడు మరణించారని ఈయన  ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది రాహుల్ రామకృష్ణకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ హానికర రసాయనాన్ని బ్యాన్ చేసి రైతుల ప్రాణాలను నిలబెట్టాలి అంటూ కోరుతున్నారు.

Advertisement

ఇక రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారనే విషయం తెలిసిన ఆయన అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ రాహుల్ రామకృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక రాహుల్ రామకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూఎంతో బిజీగా ఉన్నారు .ఇక రాహుల్ రామకృష్ణ హుషారు 2 సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఈయన చిన్న ప్రమాదానికి గురయ్యారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ ప్రమాదం కారణంగా భయపడాల్సిన పనిలేదని స్వల్ప గాయాలు కావడంతో పెద్ద ప్రమాదం ఏమి చోటు చేసుకోలేదని తెలుస్తోంది.

Also Read: Ramcharan: కంటికి గాయం.. పెద్ది సెట్ లో అభిమానులతో సందడి చేసిన చరణ్!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×